Top Heroines: టాలీవుడ్‌లో నంబర్.1 హీరోయిన్ ఎవరు?.. రేసు నుంచి వాళ్లు అవుట్!

Top Heroines: చిత్ర పరిశ్రమలో ఏ హీరో నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు, ఎవరు సెకండ్ పొజిషన్ లో ఉన్నారనేది ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. హీరోయిన్లకూ ఇది వర్తిస్తుంది. తమ ఫేవరెట్ హీరోయిన్ టాప్ లిస్టులో ఉన్నారా అనేది తెలుసుకోవడానికి అభిమానులు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే పెద్దగా పోటీ లేనప్పుడు మాత్రం ఉన్న హీరోయిన్సే లిస్టులో ఉంటారనేది కామన్. ఇప్పుడు టాలీవుడ్ లో అలాంటి పరిస్థితే నెలకొంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయికల కొరత ఎంతగానో ఉంది. ఎప్పటిలాగే హీరోయిన్ల లేమితో ఇండస్ట్రీ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. సొంతంగా హీరోయిన్లను తయారు చేసుకోకపోవడం, తెలుగు అమ్మాయిలను పెద్దగా ప్రోత్సహించకపోవడం మనకు మైనస్ గా మారింది. హీరోయిన్ పాత్రల కోసం పక్క పరిశ్రమల వైపు చూడటమో.. లేదా ముంబైకి వెళ్లి బాలీవుడ్ భామల్ని తెచ్చుకోవడం పరిపాటిగా మారింది.

 

ఇక మనం ప్రోత్సహిస్తున్న హీరోయిన్లు కాస్త క్రేజ్ రాగానే బాలీవుడ్ కు తుర్రుమంటున్నారు. దీంతో దర్శక నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు తెలుగులో నంబర్ వన్ హీరోయిన్ అనుకున్న పూజా హెగ్డేకు మహేష్ బాబు సినిమా తప్ప మరో ఆఫర్ లేదు. విజయ్ దేవరకొండతో ఆమె కమిటైన ‘జనగణమన’ చిత్రం ఆదిలోనే ఆగిపోయింది. ఇక హిందీలో నటిస్తున్న ‘సర్కస్’, ‘కిసీ కా భాయ్.. కిసీ కా జాన్’ చిత్రాలే ఆమె చేతిలో ఉన్నాయి. తెలుగులో ఒక్క మూవీనే చేస్తున్న పూజాను ఇక్కడ నంబర్ వన్ హీరోయిన్ అని ఎలా చెప్పగలమని సినీ విశ్లేషకులు అంటున్నారు.

కియారాకు చాన్స్ ఉందా..?
నేషనల్ క్రష్ రష్మికా మందన్న కూడా తెలుగు చిత్రాలకు గ్యాప్ ఇచ్చారు. ‘పుష్ప 2’ మినహా ఆమె చేతిలో మరో తెలుగు సినిమా లేదు. ఆమె బాలీవుడ్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. దీంతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేసు నుంచి ఆమె కూడా బయటికి వచ్చేసినట్లేనని అర్థం చేసుకోవాలి. ఇక రామ్ చరణ్​ తో ఓ సినిమా చేస్తున్న కియారా అద్వానీ పేరును.. ఎన్టీఆర్, కొరటాల మూవీలోనూ పరిశీలిస్తున్నారట. అందులోనూ ఓకే అయితేనే ఆమె రేసులోకి వస్తారు.

వారికి నో చాన్స్..!
ఇక సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్.. వీళ్లంతా సీనియర్స్ కావడంతో మూవీ ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. వీళ్లు ముగ్గురూ వెబ్ సిరీస్ లు, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. దీంతో వీరిని టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ గానే భావించాలి. దీంతో టాప్ హీరోయిన్స్ లిస్టులో వీళ్లూ లేనట్లేజ ఇక శ్రీలీల, కృతి శెట్టి లాంటి యంగ్ బ్యూటీస్ స్టార్ లిస్టులోకి రావడానికి ఇంకా టైమ్ పడుతుంది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ నెంబర్ వన్ హీరోయిన్ కుర్చీ మరికొన్ని రోజులు ఖాళీగానే ఉండనుంది.

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnam Raju: రఘురామ కృష్ణంరాజు కల నెరవేరిందిగా.. ఉండి ఎమ్మెల్యేగా ఆయన విజయం పక్కా!

Raghurama Krishnam Raju: ప్రస్తుత నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలుపొందారు. ఇలా గెలిచిన కొద్ది రోజులకే పార్టీ పిఠాయించి తెలుగుదేశం చెంతకు చేరారు....
- Advertisement -
- Advertisement -