Top Players: T20 ఉత్తమ క్రికెటర్ కు నామినేషన్స్.. ముందంజలో సూర్య, స్మృతి!

Top Players: ఈ సంవత్సరం ఐసీసీ ఉత్తమ టి20 క్రికెట్ అవార్డు కోసం భారత్ నుంచి సూర్య కుమార్ యాదవ్ మరియు స్మృతి మంధాన నామినేషన్ బరిలో ఉన్నారు. టి20 క్రికెట్ అవార్డుకు గాను ఐసీసీ ప్రకటించిన పురుష క్రికెటర్ల నామినేషన్ జాబితాలో పాకిస్థాన్ నుంచి మహమ్మద్ రిజ్వాన్, ఇంగ్లాండ్ నుంచి సామ్‌ కర్రాన్‌, జింబాబ్వే తరఫున సికిందర్‌ రజా కూడా ఉన్నారు.

 

ఇటు మహిళల విభాగంలో ఇండియా మహిళల జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి వరుసగా రెండోసారి నామినేట్ అయ్యారు. ఈ విభాగం ప్రకటించిన జాబితాలో స్మృతి తో పాటు పాకిస్తాన్ నుంచి నిదా దర్‌, ఆసీస్‌ కు చెందిన తహిలా మెక్‌గ్రాత్‌ మరియు కివిస్ నుంచి సోఫీ డివైన్‌ కూడా బరిలో ఉన్నారు.

 

టి20 ఉత్తమ క్రికెటర్ అవార్డుకు వచ్చే నెల ప్రారంభం నుంచి ఆన్లైన్లో ఓటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరం సూర్య కుమార్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ ఏడాది టీ20 లో మెరుగైన ఆటను కనబరిచి 1164 చేసి ఒక సంవత్సరంలో వేయి పరుగులు సాధించిన రెండవ ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. అతను 187.43 స్ట్రైక్ రేట్ తో 68 సిక్స్ లు బాధాడు.

 

ఇటు స్మృతి ఎంతో నిలకడమైనా ఆటతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ సంవత్సరం కామన్వెల్త్ గేమ్స్ లో ఇంగ్లాండ్ పై 23 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసింది. ఈ సీజన్ స్మృతి టి20 లో 2500 పరుగుల మైలురాయిని కూడా దాటింది. ప్రస్తుతం రేస్ లో ముందంజలో ఉన్న వీరిద్దరి పై అందరి దృష్టి ఉంది. ఈసారి టి20 ఉత్తమ క్రికెట్ అవార్డు రెండు విభాగాల్లో భారత్కు దక్కినట్లయితే అభిమానుల ఆనందానికి హద్దు ఉండదు. త్వరలో స్టార్ట్ కాబోతున్న ఆన్లైన్ ఓటింగ్ లో ఎవరు ముందంజలో ఉంటారో తెలియాలంటే రిజల్ట్స్ వరకు వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతానన్నవ్.. ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్?

YS Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్ పెట్టిన చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోని చూపిస్తూ ఒక్క హామీ అయినా నెరవేర్చారా అంటూ కామెంట్ చేస్తున్నారు కానీ ఆయన...
- Advertisement -
- Advertisement -