Koratala Siva: ఆచార్య ప్లాప్.. గాడ్ ఫాదర్ తో హిట్ కొట్టిన చిరు.. మరి కొరటాల పరిస్థితి ఏంటీ?

Megastar Chiranjeevi: చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని సరికొత్త రికార్డులను సృష్టించిన హీరో చిరంజీవి.అలాగే ఇండస్ట్రీలో రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు సంపాదించుకున్న వ్యక్తి కొరటాల శివ. ఇలా ఇండస్ట్రీలో విజయవంతంగా ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అలాగే ఊహించుకున్నారు మెగా అభిమానులు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆచార్య సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

ఈ విధంగా ఆచార్య సినిమా ద్వారా మెగా హీరోల హిట్ కొట్టబోతున్నారని ప్రతి ఒక్క ప్రేక్షకుడి ఎంతో ఆత్రుతగా ఎదురు చూడగా ఈ సినిమా మాత్రం ప్రేక్షకులకు తీవ్ర నిరాశగా మిగిలింది. ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత రెట్టింపు వేగంతో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా విడుదల అయ్యి ఎంతో మంచి విజయం అందుకోవడంతో ఆచార్య లోటును కూడా తీర్చిందని మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. మొత్తానికి ఆచార్య సినిమా ఫ్లాప్ అవడంతో పలుమార్లు ఈ విషయం గురించి ప్రస్తావించడం మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాతో హిట్టు కొట్టి సేఫ్ అయ్యారు. ఇక ఆచార్య వంటి డిజాస్టర్ సినిమాతో మొదటి అపజయాన్ని తన ఖాతాలో వేసుకున్న కొరటాల పరిస్థితి ఎటు తేల్చుకోలేక ఉన్నారు.

అపజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయన కెరియర్ లో ఆచార్య ఘోర పరాజయం పాలైంది.ఈ క్రమంలోనే కొరటాల తన తదుపరి సినిమాని ఎన్టీఆర్ తో చేయనున్నట్లు ప్రకటించారు. ఎలాగైనా ఈ సినిమాతో హిట్టు కొట్టాలన్న కసితో కొరటాల ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో కనుక కొరటాల హిట్ కొట్టకపోతే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎన్టీఆర్ 30 సినిమా కొరటాలకు అగ్నిపరీక్షగా మారింది. మరి కొరటాల ఈ సినిమాతో హిట్ అందుకుంటారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -