Train Accident: అదృష్టం మన వెంట ఉంటే చావు కూడా మనల్ని ఏమీ చేయలేదనే మాట మనం వినే ఉంటాం. ఎందుకంటే చావు కూడా సెలవు పెట్టి మనకు మరో అవకాశం ఇస్తుందట. ఇలాంటి అదృష్టమే ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడింది. ఏకంగా సదరు వ్యక్తి మీద నుండి ఒక రైలు వెళ్లినా కానీ అతడు ప్రాణాలతో బయటపడిన ఘటన అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. అతడికి ఇంకా భూమి మీద నూకలున్నాయి కాబట్టే బ్రతికిపోయాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
బిహార్ భగల్ పుర్ పరిదిలోని కహల్ గావ్ స్టేషన్ లో ఈ అరుదైన ఘటన సంభవించింది. ఓ వ్యక్తి తాను వెళ్లాల్సిన రైలు వేరే ప్లాట్ ఫాం మీద ఉందని, దానిని అందుకోవడానికి పట్టాల మీద నుండి దాటుకుంటూ అవతలి పక్కకు వెళదామని అనుకున్నాడు. కానీ అంతలోనే ఓ గూడ్స్ రైలు పట్టాల మీద వేగంగా దూసుకొచ్చింది. దీంతో అతడి గుండెల్లో దడ మొదలైంది.
వెంటనే ఏం చేయాలనే ఆలోచనలో ఉండగా.. అతడికి ఓ ఐడియా వచ్చింది. గూడ్స్ రైలు అతడిని సమీపిస్తుండగా.. అతను వెంటనే పట్టాల మీద పడుకున్నాడు. రైలు అతడి మీద నుండి అలా ముందుకు సాగింది. కానీ అతడికి మాత్రం ఏమీ కాలేదు. చిన్న గాయం కూడా కాకుండా సదరు వ్యక్తి బయట పడగా.. అక్కడ ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన జనాలు మాత్రం.. యముడు అతడికి సెలవు ఇచ్చినట్లున్నాడు అని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం ఆ వ్యక్తికి యముడు మరో అవకాశం ఇచ్చాడంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి అతడు ప్రాణాలతో బయటపడిన విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది
बिहार के भागलपुर में खड़ी ट्रेन के नीचे से निकलने में फंसा यात्री..किसी तरह बच गई जान@IRCTCofficial @RailwaySeva pic.twitter.com/4RDHrZNZOH
— Thakur Shaktilochan shandilya (@Ershaktilochan) November 10, 2022