Nandamuri Balakrishna: స్టార్ హీరో బాలకృష్ణపై ఫిర్యాదు చేసిన హిజ్రాలు.. ఏం జరిగిందంటే?

Nandamuri Balakrishna: టాలీవుడ్ ప్రేక్షకులకు ఎన్టీఆర్ నట వారసుడు నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకించి పరిచయంకర్లేదు. నటుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి నటనలో తండ్రికి తగ్గ కొడుకు గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక బాలయ్య బాబు అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. తన ప్రత్యేకమైన యాటిట్యూడ్ తో ఇప్పటి యువకులను సైతం ఒక రేంజ్ లో ఆకట్టుకుంటాడు బాలయ్య.

ఇటీవలె విడుదలైన అఖండ సినిమాలో బాలయ్య అద్భుతమైన నటనకు బీటౌన్ ప్రేక్షకుల సైతం ఒక రేంజ్ లో ఫిదా అయ్యారు. ఇటువంటి నటనతో బాలకృష్ణ టాలీవుడ్ అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ప్రస్తుతం పలు సినిమా అవకాశాలు అందుకుంటూ షూటింగ్ నేపథ్యంలో బిజీగా ఉన్నాడు బాలయ్య. ఇక బాలయ్య ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయంగా కూడా కొంత పలుకుబడి సంపాదించుకున్నాడు. ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్నాడు.

ఇదిలా ఉంటే బాలయ్య పై కొందరు హిజ్రాలు పోలీస్ కేసు పెట్టారు. హిందూపురంలో బాలయ్య ఉండడం లేదని కొంతమంది హిజ్రాలు పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేశారు. ఇప్పటివరకు చాలామంది బాలయ్య గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ హిజ్రాలు ఫిర్యాదు చేయడం ఇదే మొదటిసారి. హిందూపురం ఎమ్మెల్యేగా విధులు నిర్వహించాల్సిన బాలయ్య ఇక్కడ ఉండడం లేదని, వెంటనే హిందూపురంలో సమస్యలకు పరిష్కారం వెతకాల్సిందిగా కోరుతున్నామని ఆ హిజ్రాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఈ విషయం తెలిసిన నందమూరి అభిమానులు ఒక రేంజ్ లో కోపం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కావాలనే ఇదంతా చేపిస్తున్నారని కొందరు భావిస్తున్నారు. మరి ఈ విషయం గురించి బాలకృష్ణ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. ప్రస్తుతం బాలయ్య మాత్రం కుర్ర హీరోలతో సమానంగా సినిమా అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను ఒక రేంజ్ లో మెప్పిస్తున్నాడు. కాగా బాలకృష్ణ ఎన్.బి.కె 107 అనే ప్రాజెక్టుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమాతో ప్రేక్షకులను ఏవిధంగా మెప్పిస్తాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -