Travel Places: వీటిని చూస్తే మరోసారి చూడాలనిపిస్తోంది.. ఏంటో తెలుసా?

Travel Places: వివిధ దేశాల్లో ఉండే పర్యాటక ప్రాంతాల్లో వింత వింత విశేషాలు ఉంటాయి. యూరప్‌ని కొన్ని దేశాలు మన దేశంలోని రాష్ట్రాల కన్నా చిన్నగా ఉంటాయి. ఇండియా చాలా విశాలమైనది. మన దేశంలోని అన్ని పర్యాటక ప్రదేశాలు చూసేందుకు ఎన్నో ఏళ్లు పడుతుంది. మన దేశంలోని కొన్ని అందమైన ల్యాండ్ మార్క్స్ గురించి తెలుసుకుందాం.

 

గోల్డెన్ టెంపుల్: పంజాబ్ అమృత్‌సర్‌ ని స్వర్ణ దేవాలయం పేరుకే సిక్కుల ప్రార్థన మందిరమైనా అన్ని మతాల వారూ సందర్శిస్తారు. సర్వ మత సామరస్యానికి ఈ దేవాలయం ప్రతీకగా నిలుస్తోంది. ప్రపంచ పర్యాటకులందరూ దీన్ని సందర్శిస్తారు. దీని నిర్మాణ శైలి అద్భుతంగా ఉంటుంది. రాత్రి సయంలో పసిడి కాంతులతో మెరుగులు విరజిమ్ముతుంది.

అజంతా, ఎల్లోరా: మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి అజంతా, ఎల్లోరా గుహలు, కొండలను తొలిచి శిల్పాలుగా చెక్కడం అద్భుతమే. అలనాటి శిల్పుల కళా చాతుర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ప్రతీ శిల్పమూ జీవకళతో ఆకట్టుకుంటుంది. అందుకే ఈ గుహలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.

ప్యాంగాంగ్ లేక్: లఢక్‌లోని ప్యాంగాంగ్ లేక అత్యంత అందం, స్వచ్ఛమైన నీటితో ఉంటుంది. సరస్సు చుట్టూ హిమాలయ పర్వతాలుంటాయి. ఇక్కడ చైనా కంట్రోల్ లోని పశ్చిమ టిబెట్ సరిహద్దు ఉండటంతో ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది. లఢక్ టూర్‌కు వెళ్లేవారు తప్పనిసరిగా ఇక్కడికి వెళ్లగా మానరు. అక్కడికి వెళ్లిన వెంటనే ఫొటో షూట్‌ చేయకుండా తిరిగిరారు.

దాల్ సరస్సు: శ్రీనగర్‌లో ఉన్న దాల్ లేక్ కాశ్మీర్‌కే గర్వకారణంగా ఉంది. శీతాకాలంలో ఈ సరస్సు గడ్డకట్టి పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంది. అన్ని కాలాల్లోనూ ఈ సరస్సు అందంగానే ఉంటుంది. పర్యాటకులు ఎక్కువగా చలికాలంలో ఇక్కడికి వస్తుంటారు.

మీనాక్షి ఆలయం: మధురై మీనాక్షి పలుకు అనే మాట తరచూ వింటాం. తమిళనాడులో వరల్డ్ ఫేమస్ టెంపుల్ ఇది. ఈ ఆలయ నిర్మాణ శైలి అడుగడుగునా ఆశ్చర్యపరుస్తుంది. మనుషులే దీన్ని నిర్మించారా అనే అనుమానాలకు తావిస్తోంది.

గొంప: హిమాచల్ ప్రదేశ్ లాహౌల్ స్పీటీలో ఉంది ధన్కర్ గొంప. ధన్కర్ గ్రామానికి పక్కన సముద్ర మట్టానికి 3,894 మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతంపై ఉంది ఈ గొంప. ఇక్కడికి వెళ్లినవారు తప్పనిసరిగా ఈ ప్రాచీన ఇళ్లను చూస్తారు. చెక్కు చెదరకుండా ఉన్న ఈ ఇళ్లు చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

తాజ్‌మహల్: ప్రపంచ వింత కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్ ఇండియాకే ల్యాండ్ మార్క్. ఆగ్రాలోని ఈ పాలరాతి అద్భుతాన్ని చూసేందుకు ప్రపంచ పర్యాటకులు వస్తున్నారు. దీన్ని తయారుచేసిన శిల్పుల గొప్పదనాన్ని మెచ్చుకోవాల్సిందే. జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన వాటిలో ఈ ప్రేమచిహ్నం తప్పక ఉంటుంది.

నోహ్కాలికై: చిరపుంజిలోని నోహ్కాలికై జలపాతాన్ని తప్పకుండా చూడాల్సిందే. మేఘాలయలో తప్పనిసరిగా వెళ్లే సైట్ సీన్స్‌లో ఇదొకటి. పర్వతాల మధ్యలో జాలువారుతున్న ఈ ఫాల్స్‌ను పై నుంచి చూడటం నయన మనోహరం. మనదేశంలో అత్యంత ఎతైన నీటి జలపాతం ఇదే. .

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts