Kerala: వందల పక్షుల ప్రాణాలు తీశారు.. ఎక్కడో తెలుసా?

Kerala: ప్రస్తుత సమాజంలో మనకు మేలు జరగుతుందంటే ఎదుటి వారికి కీడు జరిగినా పర్వాలేదంటున్నారు. అది మనుషులకైనా.. పక్షులకైనా. సృష్టిలో తెలివైన జంతువుగా మానవుడు ఎదిగిన నాటినుంచి మానవుడు బాగుపడ్డాడు. మనిషి తన తెలివి తేటలతో బలమైన జంతువుల్ని కూడా లోబర్చుకుంటున్నాడు. వారి ఇష్టాలు కోరికల మేరకు కొందరు జంతువు, పశువులను పెంచుకుంటున్నారు.. నచ్చకపోతే చంపుకొని తింటారు. లేదా వదిలేస్తున్నారు. అయితే.. కొన్ని జంతువుల విషయంలో మరీ దారుణంగా వ్యవహరిస్తున్నాడు. తన అవసరాలు తీర్చుకుంటున్నాడే తప్ప.. తన కంటే చిన్న ప్రాణుల గురించి కొంచెం కూడా ఆలోచించటం లేదు. వాటిపై ఏమాత్రం జాలి లేకుండా తన సంతోషం కోసం వాటి ప్రాణాలు సైతం తీçస్తున్నారు.

తాజాగా జరిగిన సంఘటనే దీనికి నిదర్శంన. ఓ భారీ చెట్టును కూల్చటంతో దానిపై నివాసం ఏర్పచుకుని ఉంటున్న వందలాది పక్షులు, వాటి గూళ్లు కోల్పోగా కొన్ని పక్షులు గిలగిల కొట్టుకుంటూ చనిపోయాయి. కేరళలోని మలప్పరంలో రోడ్డు పక్కన ఉన్న ఓ భారీ చెట్టుపై వందలాది పక్షులు గూళ్లు ఏర్పాటు చేసుకుని ఉంటున్నాయి. అయితే అదే మార్గంలో రోడ్డు వెడుల్పులో భాగంగా ఆ చెట్టును కూల్చల్సి వచ్చింది. అయితే ఆ చెట్టుపై ఉన్న పక్షల గూరించి ఆలోచించకుండా అనాలోచిత నిర్ణయానికి పూనుకున్నారు. ఓ భారీ ప్రొక్లయిన్‌లో రోడ్డు పక్కనే ఉన్న చెట్టును కూల్చివేయడం ప్రారంభించారు.

ఆ శబ్దానికి కొన్ని పక్షలు తమ ప్రాణానికి నష్టం కలుగుతుందని భావించి చెట్టుపై నుంచి ఎగిరిపోయాయి. చిన్న చిన్న పిల్లలు ఉన్న పక్షులు తమ పిల్లలను కాపాడుకునే ప్రయత్నంలో ఉండగా ఒక్కసారిగా చెట్టును కూల్చేశారు. అంతే.. చెట్టు విరుగుతూ రోడ్డుపై పడటంతో చెట్టుపై ఉన్న ఎన్నో పక్షులు రోడ్డుపై గిలగిలమంటూ కొట్టుకుంటూ మృత్యువాత పడ్డాయి. చెట్టు కూల్చినప్పుడు చనిపోయిన పక్షుల వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పక్షులపై ఏమాత్రం దయా చూపకుండా చెట్టును తొలగించిన అధికారులపై కామెంట్ల రూపంలో విమర్శలు గుప్పిస్తున్నారు. చెట్టును కూల్చేముందు భారీ శబ్దాలు చేస్తే సగానికి పైగా పక్షులు ప్రాణాలతో ఉండేవని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: ఏపీ సీఎం వైఎస్ జగన్ పేరు మార్చిన చంద్రబాబు.. కొత్త పేరు ఏంటో తెలుసా?

Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజాగళం పేరిట ఈయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ అధికార ప్రభుత్వంపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -