Trivikram-Sunil: సునీల్-త్రివిక్రమ్ మధ్య ఉన్న ఈ పోలిక గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

Trivikram-Sunil: స్నేహానికి మారుపేరుగా నిలిచిన సెలబ్రిటీలు సినీ పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. వీరిలో సునీల్-త్రివిక్రమ్ ఒకరు. వీరిద్దరూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకన్న ముందు నుంచే మంచి స్నేహితులు. సినీ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని ఒకేసారి వీరిద్దరూ భీమవరం నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. ఇప్పుడు తమకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుని ఉన్నత స్థానంలో కొనసాగుతున్నారు.

 

ఇలాంటి అరుదైన అవకాశం ఇండస్ట్రీలో ఎవరికీ దొరకదు. కానీ సునీల్-త్రివిక్రమ్‌కు మాత్రమే వరించింది. స్టోరీ రైటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన త్రివిక్రమ్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్-3 డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు. సునీల్ సినిమాలు చేస్తూ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే వీళ్లిద్దరికీ అవకాశాలు ఈజీగా రాలేదు. ఎన్నో కష్టాలు పడ్డాకే అదృష్టం వరించింది.

 

అవకాశాల కోసం తిరిగేటప్పుడు సునీల్-త్రివిక్రమ్ కలిసి ఒకే రూమ్‌లో ఉండేవారు. ఒక పూట తిని రెండు పూటలు కడుపు మాడ్చుకుని అవకాశాల కోసం తిరిగేవారు. లైఫ్‌లో సెటిల్ అవ్వాలని ఒకేసారి హైదరాబాద్‌కు వచ్చిన వీరిద్దరూ తాము కోరుకున్న విధంగానే స్థిరపడ్డారు. ఇప్పటికీ వీరిద్దరూ స్నేహితులుగా ఉన్నట్లు, తమ జీవితంలో జరిగిన ఛేదు అనుభవాల గురించి ఎప్పుడూ చెబుతుంటారు. అయితే వీరిద్దరూ బయట చెప్పుకోని ఓ విషయం తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ విషయం ఏంటంటే..

వీరిద్దరు ఒకే రోజు పెళ్లి చేసుకున్నారట. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈ విషయాన్ని సునీల్-త్రివిక్రమ్ ఎక్కడా చెప్పుకోలేదు. వీరు పెళ్లి చేసుకున్న వార్తల క్లిప్పింగ్స్, పాత్రికేయులు తెలుపగా.. ఈ విషయం అందరికీ తెలిసింది. త్రివిక్రమ్.. శ్రీనగర్ కాలనీలోని శ్రీసత్య నిగమంలో ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి సోదరుడి కుమార్తె సాయి సౌజన్యతో వివాహం జరిగింది. త్రివిక్రమ్-సౌజన్య దంపతులకు ఇద్దరు పిల్లలు. అలాగే సునీల్‌కు శృతి అనే అమ్మాయితో వివాహం జరిగింది. సునీల్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకేసారి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వీరిద్దరు తమ కలలను నెరవేర్చుకుని ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. ప్రస్తుతం తమ కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -