Gudivada Amarnath: ఇంగ్లీష్‌లో మాట్లాడలేక ఇబ్బంది పడ్డ గుడివాడ అమర్ నాథ్. కేటీఆర్‌తో పోలుస్తూ ట్రోల్స్

Gudivada Amarnath: ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఇంగ్లీష్ భాషపై విమర్శలు వస్తున్నాయి. ఆయన ఇంగ్లీష్ భాషపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తోన్నాయి. ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడటం రాకపోవడంతో గుడివాడ అమర్ నాథ్‌పై ట్రోల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మంత్రి కేటీఆర్‌ ఇంగ్లీష్ భాషతో గుడివాడ అమర్ నాథ్ భాషను పోల్చుతూ ఐటీ శాఖ మంత్రి అంటే కేటీఆర్‌లా ఉండాలని, ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడటం చేతకాని గుడివాడ అమర్ నాథ్ ఐటీ శాఖ మంత్రి ఎలా అయ్యారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేల్చుతున్నారు.

 

గుంటూరు జిల్లాలో మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ కోసమంటూ ఏపీ ప్రభుత్వం ఇళ్లు కూల్చివేసిన ఘటన రాజకీయం దుమారం చెలగేరిన విషయం తెలిసిందే. ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతకు గురైన బాధితులను పవన్ కల్యాణ్ పరామర్శించేందుకు వెళ్లే సమయంలో కారుపై కూర్చోని ర్యాలీగా వెళ్లారు. పవన్ కల్యాణ్ తీరు గురించి ఓ నేషనల్ మీడియాతో ఛానెల్‌ డిబేట్‌లో గుడివాడ అమర్ నాథ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేక ఆయన తడబడ్డారు. అక్కడక్కడ కొన్ని పదాలు సరిగ్గా రాక ఇంగ్లీష్ మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడ్డారు.

 

 

దీంతో సోషల్ మీడియాలో గుడివాడ అమర్ నాథ్ ఇంగ్లీష్ భాషపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. తెలంగాణలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ తో గుడివాడ అమర్ నాథ్ ను పోలుస్తున్నారు. కేటీఆర్ ఇంగ్లీష్ మాట్లాడే వీడియోతో గుడివాడ అమర్ నాథ్ ఇంగ్లీష్ డిబేట్ లో మాట్లాడిన వీడియోను జత చేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తోన్నారు. మంత్రి కేటీఆర్ ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతున్నారో చూడండి..ఏపీ ఐటీ శాఖ మంత్రి మాత్రం ఇంగ్లీష్ మాట్లాడలేక ఇబ్బంది పడుతున్నారంటూ ట్రోల్ చేస్తోన్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -