Krithi Shetty: కాలేజ్ కు వెళ్లి చదువుకోవాలంటూ కృతిపై ట్రోల్స్.. ఏమైందంటే?

Krithi Shetty: ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై సంచలనం సృష్టించిన నటి కృతి శెట్టి. ఈమె చిన్ననాటి నుండి మోడలింగ్ చేస్తూనే ఉంది. 2019లో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన సూపర్ 30 సినిమాతో వెండితెరపై తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత రెండు సంవత్సరాలకి ఉప్పెన సినిమా ద్వారా తెలుగునాట అడుగుపెట్టి సంచలనం సృష్టించింది కృతి.

ఆ తర్వాత నానితో శ్యాం సింగరాయ్, నాగచైతన్యతో బంగార్రాజు సినిమాలు తీసి హ్యాట్రిక్ సాధించింది. ఆమె సాధించిన విజయాలు చూసి తిరుగులేని నటి అవుతుంది అని విమర్శకుల చేత సైతం ప్రశంసలు పొందింది. అయితే అనుకున్నట్లుగా జరగలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే ఆ మధ్య వరుసగా రిలీజ్ అయిన ఆమె సినిమాలు అన్ని ఫ్లాప్ ని మూట కట్టుకున్నాయి.

 

రీసెంట్ గా రిలీజ్ అయిన కస్టడీ మీద ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే ఈ సినిమా కూడా ఆమెకి నిరాశనే మిగిల్చింది. ఇప్పటికే ఆమెకి తెలుగులో అవకాశాలు బాగా తగ్గాయి. ఇక ఆమెకి మిగిలినవి తమిళంలో ఒక రెండు సినిమాలు మాత్రమే. సినిమాలలో తన భవిష్యత్తుని నిర్ణయించేది ఆ రెండు సినిమాలే.

 

సినీ ఇండస్ట్రీ హిట్స్ ఉంటే ఆకాశానికి ఎత్తేయటం లేకపోతే పాతాళానికి తొక్కేయటం అలవాటే. హ్యాట్రిక్ సాధించేసరికి గోల్డెన్ లెగ్ అంటూ ఆకాశానికి ఎత్తేసిన టాలీవుడ్ ఇప్పుడు ఆమె వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదు. ఇక ఆమె పని అయిపోయినట్లేనా అనుకుంటున్నారు నెటిజెన్స్. కృతి కూడా తను ఎంపిక చేసుకునే సినిమాల కథనాల విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టినట్లుగా కనిపించడం లేదు.

 

కస్టడీతో విజయాన్ని సొంతం చేసుకుని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావించిన ఈ అమ్మడికి కస్టడీ పెద్ద చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. కృతి శెట్టి అందాల ఆరబోత కూడా తక్కువగానే ఉందని, సోషల్ మీడియాలో ఆమె గ్లామరైజ్డ్ ఫోటోషూట్స్ కూడా ఏమి లేవని వాటి మీద పాప దృష్టి పెడితే కెరియర్ బాగుంటుందేమో అని అభిప్రాయపడుతున్నారు. లేదంటే కాలేజీకి వెళ్లి చదువుకోవడమే మంచిది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -