Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో సీబీఐ దూకుడు? కవితకు బిగుస్తున్న ఉచ్చు

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ, ఈడీ ఉచ్చు బిగుస్తోంది. ఇటీవల దేశంలోని 35 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ తో పాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే సోమవారం హైదరాబాద్ కు చెందిన అభిషేక్ రావును లిక్కర్ స్కాంలో సీబీఐ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఢిల్లీకి ఆయనను తరలించారు. సీబీఐ ఆయనను రిమాండ్ కు తరలించి విచారిస్తోంది. అభిషేక్ రావు అరెస్ట్ తో లిక్కర్ స్కాం తెలంగాణలో సంచలనం రేపుతోంది.

అయితే కవిత దగ్గర అభిషేక్ రావు గతంలో పీఏగా పనిచేసినట్లు తెలుస్తోంది. అనూస్ బ్యూటీ పార్లర్ అడ్రస్ లోనే రాబిన్ డిస్టిలరీస్ అను అభిషేక్ రావు నడుపుతున్నట్లు సీబీఐ గుర్తించింది. హైదరాబాద్ కు చెందని ప్రముఖ లిక్కర్ వ్యాపారి రామచంద్రన్ పిళ్లైతో కలిసి అభిషేక్ రావు వ్యాపారాలు చేస్తున్నట్లు తేలింది. ఇక అభిషేక్ రావు తొమ్మది కంపెనీల్లో డైరెక్టర్ గా ఉన్నట్లు సీబీఐ అధికారుల విచారణలో తేలింది. గతంలో రామచంద్రన్ పిళ్లై, అభిషేక్ రావులతో కవిత దిగిన ఫొటో ఇిటీవల వైరల్ గా మారింది. కవితకు అభిషేక్ రావు అత్యంత సన్నిహితుడు అని తెలుస్తోంది.

అలాగే కవిత ఢిల్లీ వెళ్లేందుకు పలుమార్లు అభిషేక్ రావునే ఛార్టెట్ ప్లైట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. కవితకు అత్యంత సన్నిహితుడైన అభిషేక్ రావును సీబీఐ అరెస్ట్ చేయడంతో టీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది. అభిషేక్ రావు అరెుస్ట్ తో కవితకు ఉచ్చు బిగస్తోంది. ఆయన అరస్ట్ తో కవితకు చిక్కులు వచ్చి పడ్డాయి. నెక్ట్స్ టార్గెట్ కవిత అనే ప్రచారం జోరుా జరుగుతోంది.

అయితే అభిషేక్ రావును సీబీఐ అరెస్ట్ చేసిన నేపథ్యంలో కవిత విదేశీ టూర్ కు వళ్లడం చర్చనీయాంశంగా మారింది. కవిత అమెరికాకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అభిషేక్ రావు అరెస్ట్ కావడంతో కవిత ఎక్కడున్నారంటూ చాలామంది ఆరా తీస్తున్నారు. కవిత అమెరికాకు వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. తిరిగి రావడానికి మరికొద్ది రోజులు సమయం పట్టే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది

Related Articles

ట్రేండింగ్

Minister Roja: నాడు అప్పులు నేడు కోట్ల రూపాయల ఆస్తులు.. ఆ పనులు చేసి రోజా కోట్లు సంపాదించారా?

Minister Roja: ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి నగరి ఎమ్మెల్యే రోజా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తైన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈసారి కూడా తనను గెలిపించే...
- Advertisement -
- Advertisement -