Harish Rao: మునుగోడులో కనిపించని మంత్రి హరీష్ రావు.. ఆయన ఎక్కడంటూ క్యాడర్ ఆరా

Harish Rao: రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మంత్రి హరీష్ రావు ముందు ఉంటారు. టీఆర్ఎస్ పార్టీ తరపున అక్కడ వాలిపోతారు. స్ధానిక నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ బిజీబిజీగా ఉంటారు. ఇతర పార్టీల నేతలను టీఆర్ఎస్ లో చేర్చుకోవడంపై దృష్టి పెట్టారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తారు. ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ హీట్ పెంచుతారు. దాంతో తెలంగాణలో టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా హరీష్ రావు పేరు తెచ్చుకున్నారు. అందుకే అనేక ఎన్నికలకు హరీష్ రావును కేసీఆర్ ఇంచార్జ్ గా నియమించారు. చాలా ఎన్నికలను హరీష్ రావు గెలిపించగా.. దుబ్బాక, హుజూరాబాద్ లో ఆయన షాక్ తగిలింది.

కానీ ఎక్కడ ఎన్నిక జరిగినా తన హవా చూపించే హరీష్ రావు.. మునుగోడు ఉపఎన్ని సమయంలో ఆ నియోజకవర్గంలో అసలు పర్యటించడం లేదు. ఆయన ప్రచారం కూడా నిర్వహించడం లేదు. మర్రిగూడ మండల కేంద్రానికి ఆయనను ఇంచార్జ్ గా నియమించారు. ఆయన అనుచరులు 25 మంది సిద్దిపేట నుంచి మండల కేంద్రానికి చేరకుని ప్రచారం చేస్తూ ఇంటింటి సర్వే చేపడుతన్నారు. కానీ నామినేషన్ ముగిసి ప్రచారం జోరందుున్న క్రమంలో హరీష్ రావు ఎక్కడా కనిపించకపోవడం చరర్చనీయాంశంగా మారింది. దీంతో మునుగోడు ప్రచారానికి హరీశ్ రావు దూరమైనట్లేనా అని అభిప్రాయాలు టీఆర్ఎస్ క్యాడర్ లో వినిపిస్తున్నాయి.

టీఆర్ఎస్ కు చెందిన ఐదుగురు వార్డ్ మెంబర్లతో పాటు సర్పంచ్ అభ్యర్థి బీజేపీలో చేరారు. అయినా హరీష్ రావు మండలంలో అడుగుపెట్టకకపోవడం, ఇంచార్జ్ బాధ్యతలను తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. హరీష్ రావు ప్రచారం చేస్తారా.. లేదా అనే దానిపై క్యాడర్ లో చర్చ జరుగుతోంది. హరీష్ రావు మండలంలో అడుగుపెట్టేసరికి టీఆర్ఎస్ ఖాళీ అవుతుందని, బీజేపీ నేతలు అందరినీ తమవైపుకు తిప్పుకుంటారని స్థానిక క్యాడర్ చెబుతోంది. యువకులను, టీఆర్ఎస్ సెకండ్ క్యాడర్ ను బీజేపీ ఆకర్షిస్తోంది. దీంతో ఇప్పటిైనా హరీష్ దృష్టి పెట్టాలని టీఆర్ఎస్ క్యాడర్ కోరుతోంది.

ఇప్పటికే మునుగోడు నియోకవర్గంలో ఇంచార్జ్ లందరూ తమకు కేటాయించిన ప్రాంతాల్లో పాగా వేశారు. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ క్యాడర్ లో జోష్ పెంచుతున్నారు. కానీ హరీష్ రావు ఇంకా తనకే కేటాయించిన మండంలో రంగంలోకి దిగకపోవడం గమనార్హం. ఎక్కడ ఎన్నికలు జరిగినా అందరి కంటే ముందు ఉండే హరీష్ రావు.. మునుగోడు ఉపఎన్నిలను ఎందుకు పట్టించుకోవడం లేదనే చర్చ నడుస్తోంది. మునుగోడు ఉపఎన్నికల టీఆర్ఎస్ ఇంచార్జ్ గా జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డిక కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. దీంతో అన్నీ తానై ఆయన వ్యవహరిస్తున్నారు. ఆయన కనుసన్నల్లోనే నేతలందరూ పనిచేస్తున్నారు. మునుగోడు టీఆర్ఎస్ గెలుపు బాధ్యతలను జగదీష్ రెడ్డి భుజాలపైనే కేసీఆర్ వేశారు. దీంతో ఆయన రూట్ లో నేతలందరూ పనిచేస్తున్నారు. గతంలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఎననికలకు హరీష్ రావును ఇంచార్జ్ గా నియమించగా. ఆ రెండు చోట్ల టీఆర్ఎస్ ఓడిపోయింది. దీంతో జగదీశ్వర్ రెడ్డి అన్నీ తానై నడిపిస్తుండటంతో కావాలనే హరీష్ రావు సైడ్ అయ్యారా అనే చర్చ జరుగుతోంది. మరి మునుగోడు ప్రచారంలో ఇప్పటికైనా హరీష్ రావు పాల్గొంటారా.. లేదా అనేది వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -