Chicken Distribution: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర వహించిన టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. దసరా రోజు కొత్తగా జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. దేశ రాజకీయాల్లో మార్పులు అవసరం అంటూ, కొత్త జెండాతో ముందుకు వెళ్లడానికి కేసీఆర్ సిద్ధమవుతుండగా.. టీఆర్ఎస్ నేతల్లో ఆనందం వెల్లువెత్తుతోంది.
తెలంగాణను సాధించిన కేసీఆర్, అభివృద్ధితో తెలంగాణను అగ్రగామిగా నిలిపారని, ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడంపై టీఆర్ఎస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సంబరాలు చేస్తుంటే, మరికొందరు స్వీట్లు పంచుతున్నారు. ఒక టీఆర్ఎస్ నేత చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతోంది.
కేసీఆర్ కొత్తగా జాతీయ పార్టీని పెట్టనున్న నేపథ్యంలో వరంగల్ కు చెందిన రాజనాల శ్రీహరి అనే టీఆర్ఎస్ నాయకుడు.. 200 మంది హమాలీలకు మద్యంతో పాటు ఒక కోడిని పంపిణీ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీఆర్ఎస్ నేత చేసిన పనికి ప్రత్యర్థి పార్టీల నుండి విమర్శలు వచ్చాయి.
రాజనాల శ్రీహరి ఏమన్నాడంటే..?
హమాలీలకు మద్యం, కోడిని పంపిణీ చేయడం మీద టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి స్పందిస్తూ.. ‘నేను చేసిన పనిని కావాలనే తప్పు పడుతున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతుండటం ఎంతో సంతోషం. తెలంగాణలో కేసీఆర్ వల్లే అభివృద్ధి సాధ్యమైంది. జాతీయ రాజకీయాల్లో కూడా కేసీఆర్ తనదైన ముద్ర వేస్తారు’ అని అన్నాడు.
#WATCH | TRS leader Rajanala Srihari distributes liquor bottles and chicken to locals ahead of Telangana CM KC Rao launching a national party tomorrow, in Warangal pic.twitter.com/4tfUsPgfNU
— ANI (@ANI) October 4, 2022