Tsrtc: విద్యార్థుల కోసం మరో నిర్ణయం తీసుకున్న టిఎస్ఆర్టీసీ.. ఇకపై బస్ పాస్ తో అందులో కూడా ప్రయాణం!

Tsrtc: కాలేజీలో చదువుకునే విద్యార్థులు కాలేజ్ బస్సు లేదా ప్రైవేట్ వాహనాలలో వెళ్తుంటారు. అంతేకాకుండా ఆర్టీసీ బస్సులలో కూడా ప్రయాణిస్తూ ఉంటారు. చాలావరకు హైదరాబాద్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులంతా ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణిస్తారు. కారణం ఏంటంటే కాలేజ్ బస్సు, ప్రైవేట్ వాహనాలకు అయ్యే చార్జీల కంటే బస్సు పాసుల చార్జీ తక్కువగా ఉంటుంది కాబట్టి.

దీంతో చాలామంది విద్యార్థులు ఎస్ ఆర్ టీసీ బస్సులలోనే ప్రయాణిస్తున్నారు. అయితే తాజాగా ఆర్టీసీ విద్యార్థులకు ఒక శుభవార్త చెప్పింది. అదేంటంటే మామూలుగా తమకున్న గ్రేటర్ పాసులతో మెట్రోలలో ప్రయాణించడం కష్టం. దీంతో విద్యార్థుల రద్దీ ఎక్కువ కావడం వల్ల.. ఆర్డినరీ బస్సులు తక్కువగా ఉండటంతో మెట్రో బస్సులలో ప్రయాణించడం కోసం గతంలో బస్సు పాస్ కాంబినేషన్ కి పది రూపాయలు చెల్లిస్తే మెట్రో బస్సులో ప్రయాణించేది.

అయితే కొంతకాలం తర్వాత మరో రూ.10 రూపాయలు పెంచి కాంబి టికెట్ ధర రూ.20 రూపాయలు చేయగా మళ్లీ తాజాగా పది రూపాయలు తగ్గించింది. దీంతో కాంబి 10 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించారు. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ బస్సు పాసుతో పల్లెల్లో నుంచి వచ్చే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ గా నడిచే పల్లె వెలుగు బస్సులలో కూడా ప్రయాణించవచ్చని తెలిపింది. దీంతో ఈ నిర్ణయాలను విద్యార్థులను, బస్సులను దృష్టిలో పెట్టుకొని తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ. ఇక ఈ సదుపాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ కోరింది. తాజాగా ఆర్టీసీ విడుదల చేసిన లెటర్ కూడా వైరల్ అవుతుంది.\

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -