TV Reporter: కండోమ్ ని రిపోర్టర్ ఎలా వాడిందో తెలిస్తే షాక్ అవుతారు!

TV Reporter: సమయస్ఫూర్తి అనేది మనందరికీ చాలా ముఖ్యం. ఆపదలు, ప్రమాదాల నుంచి వేగంగా గట్టెక్కాలంటే వెంటనే మంచి ఐడియాలు రావాలి. అలాంటప్పుడు మనల్ని రక్షించేది సమయస్ఫూర్తే. అది ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా గట్టెక్కొచ్చు. అందుకే చిన్నప్పటి నుంచి టీచర్లు, తల్లిదండ్రులు మనకు సమయస్ఫూర్తి ఉండాలని నేర్పుతుంటారు.

వర్షాలు, వరదల సమయంలో మరీ చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులు, అత్యవసర రంగాలకు చెందిన వారు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అలా అయితేనే వృత్తిలో ఆటకంగాలు ఎదురైనా అధిగమించగలుగుతారు. అత్యవసర సమయంలో మంచి ఐడియాలు రాకుంటే ఇబ్బంది ఎదుర్కొనే ప్రమాదం ఉంది.

ఇటీవల అగ్రరాజ్యం అమెరికాలో జోరు వానలు, వరదలు వచ్చి అల్లకల్లోలం సృష్టిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అక్కడి ఫ్లోరిడా నగరం తీవ్రంగా ప్రభావితమైంది. వరదల ధాటికి అల్లాడుతోంది. ఏకంగా నగరాలు నీట మునిగి అతలాకుతలమవుతోంది. ఇళ్లు నీటిపై తేలియాడాయి. రోడ్లపైకి షార్క్ లు కొట్టుకొచ్చాయి. అయితే, అక్కడ ఓ రిపోర్టర్ కు వచ్చిన ఐడియా ఇప్పుడు అందరినీ ఆకర్శిస్తోంది. ఈ ఘటన వైరల్ గా మారింది. వర్షం వస్తున్న సమయంలో తన వృత్తిలో ఇబ్బంది ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో కొత్తగా చెప్పింది.

రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో వర్షం వస్తోంది. తన మైక్ తడవకుండా దానికి ఓ కండోమ్ ను తొడిగింది. దీంతో మైక్ తడవలేదు. ఈమె ఐడియాకు నెటిజన్లు ఫిదా అయ్యారు. వాయ్ ఈ ఐడియా ఏదో బాగుందే.. అంటూ కితాబిస్తున్నారు. కండోమ్ ను ఇలా కూడా వాడొచ్చా అని కామెంట్లు పెడుతూ షేర్లు చేస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మీడియా సోదరులు ఈమె సమయస్ఫూర్తికి అవాక్కవుతున్నారు. అయితే, ఇది అమెరికాలో కాబట్టి సరిపోయిందని, అదే మనదేశంలో అయితే వింతగా చూసేవారని కూడా కామెంట్లు దర్శనమిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కు ఎక్కువ సీట్లు ఇచ్చే ఆలోచన లేదా.. ఏం జరిగిందంటే?

Pawan Kalyan: ఏపీలో తాజాగా జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ హవానే...
- Advertisement -