TV Channels: టీవీ9, ఎన్టీవీ నంబర్ 1 కొట్లాట.. ఏది టాప్ అంటే?

TV Channels: తెలుగు న్యూస్ ఛానల్ మధ్య నెంబర్ గేమ్ నడుస్తుంది. పలు న్యూస్ ఛానల్ మేము నెంబర్ వన్ అంటే మేము నెంబర్ వన్ అని కొట్లాడుకుంటున్నారు. తెలుగు న్యూస్ చానల్స్ ఎన్నో ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే న్యూస్ ఛానల్ అంటే ఇలాగే ఉండాలి అని టీవీ9 ఎన్నో న్యూస్ ఛానల్ లకు దారి చూపించింది. ఇలా ఎన్నో విభిన్నమైన వార్తలను సంచలనమైన వార్తలను డిబేట్లను నిర్వహిస్తూ మంచి ప్రేక్షకాదరణ పొందడం కోసం టీవీ9 కృషి చేస్తూనే ఉంది.

ఇలా పలుమార్లు టీవీ9 నెంబర్ వన్ పొజిషన్లో కూడా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మాత్రం మేమే గొప్ప అంటే మేము గొప్ప అంటూ న్యూస్ చానల్స్ కొట్లాడుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం ఎన్టీవీ తమ న్యూస్ ఛానల్ నెంబర్ వన్ పొజిషన్లో ఉంది అంటూ తమ న్యూస్ ఛానల్ లోనే ప్రసారం చేసుకోవడం మొదలు పెట్టింది.న్యూస్ ఛానల్లో ఏ కార్యక్రమం ప్రసారం చేసిన తమ ఛానల్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది అంటూ సొంత డప్పు కొట్టుకుంటున్నారు.

 

ఇలా ఎన్టీవీ నెంబర్ వన్ న్యూస్ ఛానల్ అంటూ చెప్పుకోవడంతో టీవీ9 ఏకంగా హైదరాబాద్ మొత్తం పెద్ద ఎత్తున పోస్టర్లు అతికించారు. మోసం, దగా, కుట్ర ఇవేవీ నెంబర్ 1 కాజాలవు అని అర్థం వచ్చేలాగా.. టీవీ 9 ఫ్లెక్సి పోస్టర్లను హైదరాబాదు మొత్తం ఏర్పాటు చేశారు. ఇది కచ్చితంగా ఎన్టీవీ కి కౌంటర్ ఇచ్చినట్లే ఉందని అర్థమవుతుంది అయితే ఇక్కడ ఏ న్యూస్ ఛానల్ నెంబర్ వన్ పొజిషన్లో ఉందనే విషయాన్ని ఎలా గుర్తిస్తారు అనే విషయానికి వస్తే సదరు న్యూస్ ఛానల్లో ప్రసారం అవుతున్న కార్యక్రమాలకు వచ్చే రేటింగ్ అలాగే యూట్యూబ్ లో వచ్చే వ్యూస్ ఆధారంగా నెంబర్ వన్ ఛానల్ లేదని రేటింగ్ ఇస్తారని తెలుస్తోంది.

 

అయితే ఇలా నెంబర్ వన్ న్యూస్ ఛానల్ గా పేరు సంపాదించుకోవడం చానెళ్ల వ్యాపారం కోసం యాడ్ టారిఫ్ పెంచుకోవడానికి ఉపయోగపడేదే తప్ప.. ప్రజల కోణంలోంచి చూస్తే.. రాజకీయ పార్టీలకు కొమ్ము కాయకుండా నిజాయితీగా నిజాలను, వేగంగా అందించే న్యూస్ ఛానల్ మాత్రమే నెంబర్ వన్ ఛానల్ అని గమనించాలి ఏదైనా సరే చాలా నిజాయితీగా నిబద్ధతగా ప్రేక్షకులకు చేరవేసే చానల్ నెంబర్ వన్ ఛానల్ అని ప్రేక్షకులు భావిస్తారు.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -