Baby: ఒకటే కథతో రంగంలోకి దిగిన మరో రెండు సినిమాలు!

Baby: సాధారణంగా టాలీవుడ్ లో ఒకే కథని పోలిన సినిమాలు వస్తూ ఉంటాయి. ఇలా రావడం వల్ల సదరు సినిమాల దర్శక నిర్మాతలు నష్టపోతూ ఉంటారు. తాజాగా ప్రభాస్ ప్రాజెక్టు కే విషయంలో కూడా ఇదే గండం ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే నెట్టింట్లో మరో రెండు సినిమాలు ఇదే కథతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయట మరి ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.

తెలుగు ప్రేక్షకులకు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బేబీ సినిమా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అట. ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమిస్తారు. అందులో ఒకడు మంచివాడు మరొకడు చెడ్డవాడట. ఇక త్వరలో విడుదల కాబోయే బుట్ట బొమ్మ కథ కూడా ఇంతే అని తెలుస్తుంది.

మలయాళం సినిమా కప్పేలకి ఇది రీమేక్ ఇది కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. ఇక బేబీ సినిమా కూడా అలాంటి కథనే. కాకపోతే బొట్టు బొమ్మ మలయాళం సినిమా కప్పేలా రీమేక్ కాబట్టి దీనికి అంతగా కాపీ ముద్ర పడదు. కాకపోతే ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో ఏది విడుదల అవ్వ బోతుంది అన్నదాని గురించి ఆలోచిస్తున్నారు. ముందు బేబీ సినిమాను విడుదల చేస్తే బుట్ట బొమ్మ సినిమాను కాపీ అనుకునే అవకాశాలు చాలా ఉన్నాయి.

మరి ఈ రెండు సినిమాల్లో ఏది మొదటి విడుదల చేస్తారో తెలియదు. ఇటీవలే బుట్ట బొమ్మ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఇది గమనిస్తుంటే బుట్ట బొమ్మ ను బేబీ కంటే ముందే ప్రేక్షకులకు పరిచయం చేస్తారు అన్నట్లు తెలుస్తుంది. ఇక బేబీ సినిమా పూర్తిగా అన్యాయం అవుతుందని కొందరు భావిస్తున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా మొదటగా విడుదల చేస్తారో తెలియాలి అంటే వేచి చూడాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -