Uday Kiran: ఉదయ్ కిరణ్ మరణం వల్ల ఆ స్టార్ ఇండస్ట్రీకి దూరమయ్యారా?

Uday Kiran: సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే చాలా కష్టపడాలి. అదే హీరో, హీరోయిన్‌గా రాణిచాలంటే కత్తి మీద సాముతో కూడుకున్న పనే అని చెప్పాలి. ఇండస్ట్రీలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించాలని చాలా మంది యువత కలలు కంటూ వస్తుంటారు. అయితే వీరందరూ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వెంటనే హీరోగా, హీరోయిన్లు అవుతారనే గ్యారంటీ ఉండదు. అవకాశాలు కూడా ఈజీగా రాకపోవచ్చు. ఒక వేళ హీరోగా ఛాన్స్ వచ్చినప్పటికీ.. స్టార్ స్టేటస్‌ను కంటిన్యూ చేసుకోవడం కష్టం. అలాంటి వారిలో హీరో ఉదయ్ కిరణ్ ఒకరు.

 

 

హీరో ఉదయ్ కిరణ్.. ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ఎంత త్వరగా సంపాదించుకున్నాడో.. అంతే త్వరగా పాతాళానికి పడిపోయాడు. ఆర్థికంగా ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్న ఉదయ్ కిరణ్ చివరకు ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయాడు. అప్పట్లో ఉదయ్ కిరణ్ మరణం ఒక మిస్టరీగానే సాగింది. ఇప్పటికీ ఆయన మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతాయి. ‘చిత్రం’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్.. ఫస్ట్ మూవీతోనే హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. వరుస అవకాశాలతో ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. కానీ ఆర్థిక స్థితి బాగోకపోవడం.. ఇంటి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితికి దిగజారాడు. చివరకు సూసైడ్ చేసుకుని మరణించాడు. దీంతో ఉదయ్ కిరణ్ మృతి ఇండస్ట్రీకి ఒక గుణపాఠంగా మారింది.

 

 

అయితే ఉదయ కిరణ్ మృతిని చూసి.. టాలీవుడ్‌లో అప్పటివరకు ఎన్నో సినిమాలు చేసిన ఓ హీరో ఇండస్ట్రీనే వదిలి దూరంగా వెళ్లిపోయాడు. ప్రస్తుతం బిజినెస్ చేసుకుని బతుకుతున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్‌లతో సినిమాలు కూడా చేశాడు. ఆయన హీరోగా నటించిన సినిమాలు మంచి ప్రాఫిట్ తీసుకొచ్చాయి. అమ్మాయిల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉండేది. అంతటి ఫ్యాన్ ఫాలొయింగ్ ఉన్న ఆ హీరో.. ఉదయ్ కిరణ్ మరణంతో పూర్తిగా ఇండస్ట్రీ నుంచి దూరమయ్యాడు. సినిమాల్లో అవకాశాలు ఇస్తామని చెబుతున్నా.. అవేవి పట్టించుకోకుండా తన లైఫ్ తాను జీవిస్తున్నాడు. ఇండస్ట్రీలో ఉంటే ఏమైనా జరగొచ్చని భయపడని ఆ హీరో ప్రస్తుతం వీటన్నింటికీ దూరంగా ఉంటూ.. హ్యాపీగా బతుకుతున్నట్లు పలువురు చెబుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

AP Electricity: ఏపీలో విద్యుత్ కోతలు మొదలు.. పవర్ కట్ వల్ల జగన్ పవర్ కట్ అయ్యే ఛాన్స్ ఉందా?

AP Electricity: ఏపీలో కరెంటు కోతలు అనే మాట ఓ తరానికి ముందు విన్నాం. ఇప్పుడు అలాంటి మాట వినాల్సిన పని లేదనే అనుకుంటాం. పైగా రాష్ట్ర విభజన తర్వాత కరెంటు కోతలు...
- Advertisement -
- Advertisement -