Umran Malik: టీమిండియాలో ఉమ్రాన్ మాలిక్‎కు దొరకని ప్లేస్.. తండ్రి కామెంట్ ఇదే!

Umran Malik: క్రికెట్ లో ప్రపంచవ్యాప్తం అన్ని టీంల మీద అద్భుతంగా ఆడగల సత్తా మన టీమిండియాకు ఉంది. టీమిండియా ఆట అంటే అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. అయితే టీమిండియా అంటే ముందు నుండి బ్యాటింగ్ కు పెట్టింది పేరు. మన బ్యాటర్లు ఒక్కసారి బ్యాట్ పట్టి బరిలోకి దిగితే ఎంతటి స్కోర్ ని అయినా ఈజీగా బాదేస్తారు.

 

అయితే టీమిండియాకు వచ్చిన చిక్కంతా బౌలర్లతోనే. బ్యాటింగ్ లో ఉన్నంత బలం టీమిండియాకు బౌలింగ్ లో లేదు. ప్రత్యర్థులను మట్టి కరిపించే సమర్థవంతమైన బౌలర్లు లేని టీమిండియా.. అందుకే అపజాలను మూటగట్టుకుంటోంది. తాజాగా టీ20 వరల్డ్ కప్ లో కూడా బౌలర్లు లేని లోటు కనిపించింది. ఒక్క బుమ్రా తప్పితే బలమైన బౌలర్లు ఎవరూ కనిపించడం లేదు.

 

ఐపీఎల్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న బౌలర్.. ఉమ్రాన్ మాలిక్. టీమిండియాకు ఎంతో కాలంగా ఉన్న బౌలర్ల లోటును తీర్చగల పర్ఫెక్ట్ ప్లేయర్. ప్రస్తుతం టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచుల్లో ఆకట్టుకుంటున్న ఉమ్రాన్ మాలిక్ కు.. టీ20 వరల్డ్ కప్ లో కూడా అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

 

అయితే టీ20 వరల్డ్ కప్ కు ఉమ్రాన్ మాలిక్ ను సెలెక్ట్ చేస్తారని ఊహించని.. బీసీసీఐ మాత్రం ఉమ్రాన్ మాలిక్ పేరును సెలెక్ట్ చేయలేదు. కాగా తన కొడుకును టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియాలో చోటు ఇవ్వకపోవడంపై ఉమ్రాన్ మాలిక్ తండ్రి భిన్నంగా స్పందించాడు. ‘టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియాలోకి ఉమ్రాన్ ని ఎంపిక చేయకపోవడం ఓ రకంగా మంచిదే. ఎందుకంటే కొన్ని విషయాల్లో కంగారు పడకూడదు. వాడు ఇంకా నేర్చుకునే స్టేజీలోనే ఉన్నాడు’ అని ఉమ్రాన్ మాలిక్ తండ్రి కామెంట్ చేశాడు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -