Jabardasth: బాడీ షేమింగ్ కామెంట్స్ భరించలేక జబర్దస్త్ నుంచి ఆ యాంకర్ అవుట్

Jabardasth: బుల్లితెరపై జబర్దస్త్ షో రారాజుగా వెలుగుతోంది. దాదాపుగా దశాబ్ద కాలంగా తెలుగు ప్రేక్షకులను ఈ షో అలరిస్తూ వస్తోంది. ఇప్పటి వరకూ ఆ షోలో అనేక మార్పులు చేర్పులు జరిగాయి. ఎన్ని వివాదాలు వచ్చినా ఎన్ని తగాదాలు జరిగినా కూడా జబర్దస్త్ మాత్రం ముందుకు వెళ్తూనే ఉంది. పాత వారు వెళ్తున్నా, కొత్త వారు వస్తున్నా షో ఇమేజ్ మాత్రం తగ్గడం లేదు.

 

అప్పట్లో మెగా బ్రదర్ నాగబాబు షో నుంచి వెళ్లిపోయాక ఈ షో నడుస్తుందా లేదా అని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత టీమ్ లీడర్లు కూడా జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చేశారు. కొంతమంది ముఖ్యమైన కంటెస్టెంట్లు కూడా వచ్చేశారు. యాంకర్లు కూడా మారుతూ ఉన్నారు. ఈ మధ్యనే యాంకర్ అనసూయ కూడా ఈ షో నుంచి బయటకు వచ్చేసింది. ఇంతమంది ఒక్కసారిగా బయటకు వచ్చేస్తే ఈ షో ఆగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇంకాస్త ఉత్సాహంతో ఈ షో ముందుకు సాగుతూనే ఉంది.

 

ఇకపోతే అనసూయ ఈ షో నుంచి వెళ్లిపోయిన తర్వాత యాంకర్ గా సౌమ్య రాయ్ వచ్చింది. అయితే ఆమె కూడా ఇప్పుడు జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోతుందని టాక్ వినిపిస్తోంది. అనసూయ ఏ కారణంతో అయితే ఈ షో నుంచి బయటకు వెళ్లిందో సౌమ్య కూడా అదే కారణంతో బయటకు వెళ్లనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

ఈ మధ్యకాలంలో జబర్దస్త్ షోపై సోషల్ మీడియాలో కాంట్రవర్షీయల్ కంటెంట్ ఎక్కువగా వస్తోందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. జబర్దస్త్ లో ఎన్నో రకాల వివాదాలు రాజ్యమేలుతున్నాయి. ఆ షో నుంచి బయటకు వచ్చేసినవారు మాత్రం నిర్వాహకులపై గట్టి కౌంటర్సు ఇస్తూ ఉన్నారు. బాడీ షేమింగ్ గురించి హద్దులు మీరి మాట్లాడుతున్నారని గతంలో అనసూయ షో నుంచి వచ్చేసింది. ఇప్పుడు సౌమ్య కూడా తన అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చేస్తోందని రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -