Unconditional Love: రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్ళను కోల్పోయిన యువకుడు… ప్రేమించిన యువతి ఏం చేసిందంటే?

Unconditional Love: సాధారణంగా కొందరు ప్రేమ పేరుతో పెద్ద ఎత్తున యువతి యువకులను మోసం చేసి వారి దగ్గర భారీగా డబ్బును తీసుకొని వారిని మోసం చేస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుత కాలంలో నిజమైన స్వార్థం లేని ప్రేమ చాలా కరువైంది. అయితే ఈ జంటను చూస్తుంటే మాత్రం స్వార్థం లేని ప్రేమకు నిలువెత్తు నిదర్శనం అని చెప్పాలి. ప్రేమించిన యువకుడికి రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన తానే జీవితం అనుకొని ఈ యువతి చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. పూర్తి వివరాలలోకి వెళితే..

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని సవనేరి గ్రామానికి చెందిన ప్రకాశ్‌, వల్లియమ్మాల్‌ పురానికి చెందిన దివ్య గత ఐదు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇక వీరి ప్రేమ విషయం ఇది కుటుంబ సభ్యులకు చెప్పి వీరి పెళ్లికి కుటుంబ సభ్యులను ఒప్పించారు. వీరి పెళ్లికి కూడా కుటుంబ సభ్యులు ఒప్పుకోవటంతో పెళ్లి పనులలో నిమగ్నమయ్యారు. అయితే అనుకోకుండా ప్రకాష్ రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఆయన రెండు కాళ్ళను కోల్పోవాల్సి వచ్చింది.

ఈ విధంగా ప్రకాష్ రెండు కాళ్లు కోల్పోవడంతో తనతో దివ్య పెళ్లి చేయడానికి కుటుంబ సభ్యులు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. అయితే దివ్య వారి కుటుంబ సభ్యులను బెదిరించి గత నెల 20వ తేదీ ప్రకాష్ ను వివాహం చేసుకుంది. ఇలా తన మాట కాదని తన కూతురు ప్రకాష్ ను పెళ్లి చేసుకోవడంతో ఆగ్రహించిన దివ్య కుటుంబ సభ్యులు ప్రకాష్ ఇంటికి వచ్చి దివ్య పై దాడి చేసి తనని వారి ఇంటికి బలవంతంగా తీసుకెళ్లారు.

ఈ క్రమంలోనే ప్రకాష్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఎలాగైనా దివ్య కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకొని తనని తన భార్యను కలపాలని ప్రకాష్ పోలీసులను కోరారు. అయితే వీరి ప్రేమ గురించి సోషల్ మీడియాలో తెలియడంతో ఎంతోమంది దివ్య ప్రకాష్ ప్రేమపై ప్రశంసలు కురిపిస్తున్నారు. స్వచ్ఛమైన ప్రేమ ఉంటే ఏ అంగవైకల్యం కనిపించదని నిజమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం అంటూ ఈ జంటకి మద్దతు తెలుపుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -