Undavalli Sridevi Husband: వైరల్ అవుతున్న ఉండవల్లి శ్రీదేవి భర్త సంచలన వ్యాఖ్యలు!

Undavalli Sridevi Husband: వైఎస్ఆర్సిపి పార్టీ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే. ఈమె ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో భాగంగా క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారంటూ నిరూపణ కావడంతో అధికార పార్టీ ఈమెను సస్పెండ్ చేశారు. ఇలా ఉండవల్లి శ్రీదేవి సస్పెండ్ కావడంతో ఈమె గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అలాగే అధికార పక్ష పార్టీపై ఉండవల్లి శ్రీదేవి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనని ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేసే పార్టీ నుంచి బయటకు పంపించాలని ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. పార్టీలో జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ నాకు తెలియటం వల్లే తనని పార్టీకి దూరం చేశారంటూ ఈమె ఆరోపణలు చేశారు. ఇక ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యే అయినప్పటికీ ఈమె ప్రజలకు ఏ విధమైనటువంటి సహాయాలు చేసే వారు కాదంటూ ఆరోపణలు వచ్చాయి. అలాగే అరటిపండ్ల బండి నుంచి మొదలుకొని చికెన్ కొట్టు వరకు కూడా ప్రతి ఒక్కరి దగ్గర కమిషన్ రాబట్టేది అంటూ కూడా వార్తలు వచ్చాయి.

 

అయితే ఈ వార్తలను శ్రీదేవి భర్త ఖండించారు. శ్రీదేవి ఎమ్మెల్యే కాకముందు డాక్టర్ అనే విషయాన్ని ఎవరు మర్చిపోకూడదని చెప్పారు. మా ఇద్దరికీ హైదరాబాదులో హాస్పిటల్స్ ఉన్నాయని తెలిపారు. అలాగే తమ పెద్దవారు తమకు ఇచ్చిన ఆస్తులు కూడా ఉన్నాయని ఇప్పుడు ఆస్తులు రేట్లు పదింతలు ఎక్కువయ్యాయని తెలిపారు. క్రాస్ ఓటింగ్ పాల్పడినందుకు భారీగానే డబ్బులు తీసుకున్నామని వార్తలు వస్తున్నాయి. అయితే మా ఆస్తులు 200 కోట్లకు పైగానే ఉంటాయి అంటూ ఈ సందర్భంగా ఉండవల్లి శ్రీదేవి భర్త తెలిపారు.ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులున్న మాకు అరటిపండ్లు బండి దగ్గర చికెన్ కొట్టు దగ్గరికి వెళ్లి 100, 200 కమిషన్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదని ఇదంతా కేవలం గిట్టని వారు చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రమేనని తెలిపారు.

 

 

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -