Chandramukhi: సినీప్రియులకు చంద్రముఖి సినిమా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో ఈ సినిమాకి భారీ స్థాయిలో ప్రేక్షక ఆదరణ దక్కింది. 2005లో విడుదలైన ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో పాత్ర పోషించాడు. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. నిజానికి ఇది మలయాళం చిత్రం.
మొదట మలయాళం లో మణిచిత్రతాము గా విడుదలయ్యింది. మలయాళం లో భారీ స్థాయిలో విజయం అందుకోవడంతో ఈ సినిమాను తెలుగులో కూడా డబ్బింగ్ చేశారు. కాగా ఈ సినిమాకు పి వాసు దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో రామకృష్ణ గారు అద్భుతమైన సంభాషణలు వినిపించారు. అప్పట్లో భారీ అంచనాలతో చేసిన తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. నిజంగా ఈ సినిమా స్టోరీ మిగతా చిత్రాల సినిమాల స్టోరీల కంటే భిన్నంగా ఉంటుంది.
ఎందుకంటే ఈ కథలో మొత్తం పెద్ద బంగ్లా, 32 అడుగుల పాము అలా మరో స్థాయిలో కథా నైపుణ్యాలు చిత్రీకరించారు. అలా ఈ సినిమా అప్పట్లో భారీ స్థాయిలో హైప్ ను సంపాదించుకుంది. చంద్రముఖి సినిమా చూసినప్పుడు నిజంగా ఇది ఎక్కడో జరిగే ఉంటుందని చాలామంది ప్రేక్షకులు ఊహించారు. కానీ ఈ సినిమా నిజంగానే జరిగింది. దాని గురించి మనం ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
కేరళలోని అలంపూల జిల్లాల్ లో చంద్రముఖి సినిమాలో జరిగినట్టుగా 10 శాతం జరిగిందట. అలంపూల జిల్లాలో ఒక చిన్న ఊర్లో విసిరేసినట్టుగా ఒక పెద్ద బంగ్లా ఉండేదట. దాని చుట్టూ పెద్ద ప్రహరీ గోడ కూడా ఉండేదట. ఇది ట్రావెల్ కుర్రాజ్యంలోని ఒక చిన్న జమిందార్ ఇల్లు. ఈ జమిందారి కుటుంబం లో చంద్రముఖి సినిమాలో జరిగిన సన్నివేశాలు జరిగాయి. అంటే ఈ జమిందారి కుటుంబాన్ని ఆధారంగా తీసుకొని చంద్రముఖి సినిమాను చిత్రీకరించారు. ఏదేమైనా ఈ సినిమా అప్పటి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికీ కూడా ఈ సినిమాను కొంతమంది చూడ్డానికి ఆసక్తి చూపుతారు.