Viral: పెళ్లి కాని అబ్బాయిలకు షాక్.. ఎదురు కట్నం ఇవ్వక తప్పదా?

Viral: సాధారణంగా చాలా వరకు పెళ్లిళ్లు కట్నం విషయంలోనే ఎక్కువగా ఆగిపోతూ ఉంటాయి. ఎక్కువగా పెళ్లి కొడుకు తరపున వారు కట్నం సరిపోలేదని చివరి నిమిషంలో అయినా పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. డబ్బులు సరిపోక తల్లిదండ్రులు పడే ఇబ్బందులు, పెళ్లి పీటలపై పెళ్లి ఆగిపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది అన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ప్రస్తుత కాలంలో సీన్ రివర్స్ అయ్యింది. కట్నం సరిపోలేదని ఓ అమ్మాయి చివరి నిమిషంలో పెళ్లి రద్దు చేసుకుంది. వరుడి కుటుంబసభ్యులు ఎంత నచ్చజెప్పినా వినలేదు.

హైదరాబాద్ సమీపంలోని ఘట్కేసర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన ఓ యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువతితో పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు. అబ్బాయి తరఫు వారు అమ్మాయికి రూ. 2 లక్షలు కట్నం ఇచ్చేలా పెద్దల సమక్షంలో అంగీకారం కుదిరింది. శుభలేఖలు పంచుకున్నారు. అయితే గురువారం రాత్రి 7.21 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. వరుడు, కుటుంబసభ్యులు, బంధువులు ఫంక్షన్ హాల్‌కు చేరుకున్నారు. ముహూర్తానికి సమయం దగ్గర పడుతున్నా వధువు, వారి కుటుంబసభ్యులు ఎవరూ రాకపోవడంతో అబ్బాయి తరఫు బంధువులు ఆందోళనకు గురయ్యారు.

 

అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఏమైందని ఆరా తీయగా తనకు అబ్బాయి వాళ్లు ఇచ్చే కట్నం సరిపోదని, అదనంగా డబ్బు కావాలని వధువు డిమాండ్‌ చేసింది. పెళ్లి ముహూర్త సమయానికి గంట ముందు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తెగేసి చెప్పేసింది. దాంతో చేసేదేమీ లేక వరుడి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులను పోలీసులు స్టేషన్‌కు రప్పించారు. అక్కడ రాజీ కుదిర్చే ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అమ్మాయికి కట్నం కింద ముందస్తుగా ఇచ్చిన లక్ష రూపాయలను సైతం అబ్బాయి తరఫు వారు వదులుకున్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -