Unstoppable 2: ప్రభాస్ ఎపిసోడ్ గ్లింప్స్ రిలీజ్.. ప్రభాస్ ఏం అంటూ?

Unstoppable 2: బాలయ్య బాబు అన్‌ స్టాపబుల్‌ సరికొత్త ఎపిసోడ్లో గెస్ట్ గా రాబోతున్నది ప్రభాస్ మరియు గోపీచంద్ అన్న న్యూస్ అందరికీ తెలిసింది. డార్లింగ్ ఫాన్స్ ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్న నెట్లో లీక్ అయిన ప్రభాస్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయి ఉన్నాయి.

ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఆహా అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్.బి.కె టీమ్‌ ఈ షో కి సంబంధించిన చిన్న గ్లింప్స్ ను విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ సీజన్ 2 లో ఎందరో రాజకీయ మరియు సినీ ప్రముఖులు వచ్చి సందడి చేశారు. మాజీ ముఖ్యమంత్రి రాజకీయ దురంధరుడు అయిన నారా చంద్రబాబు నాయుడుతో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటివరకు కిరణ్ కుమార్ రెడ్డి, విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ ,అల్లు అరవింద్ ,సురేష్ బాబు ,కే రాఘవేంద్రరావు వంటి హేమాహేమీలు పాల్గొన్నారు.

అయితే ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత డిమాండ్ రాబోతున్న ఎపిసోడ్ కి ఏర్పడింది. ఆదివారం ఈ షోలో పాల్గొన్న ప్రభాస్ మరియు గోపీచంద్ పై షూటింగ్ జరిగింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ప్రేక్షకులకు చిన్న సర్ప్రైజ్ ఇస్తూ ఈ షో కి సంబంధించిన ఒక చిన్న క్లిప్ విడుదల చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ టైం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టాక్ షో కి అటెండ్ అవుతున్నారు అని చాలా గ్రాండ్ గా వెల్కమ్ పలికారు. ఇందులో ప్రభాస్ ఎంట్రీ హైలైట్ గా ఉంది. ప్రభాస్ను చూసి ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చిన ఆడియన్స్ కు డార్లింగ్ తిరిగి ఫ్లయింగ్ కిస్సులు ఇవ్వడం విశేషం.

బాలకృష్ణ షో అంటేనే ఎంత సరదాగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఇందులో మరీ కళ్ళజోడు పైకి ఎగరేసి ‘ఏయ్‌.. ఏం చెప్తున్నావ్‌ డార్లింగ్‌` అని ఆయన పలకరించిన తీరు ఎంతో వినూత్నంగా ఉంది. మరోవైపు ప్రభాస్ ని రమ్మని బాలకృష్ణ అనగానే వద్దు సార్ అన్నట్లుగా ప్రభాస్ దూరం వెళ్లడం , మరోపక్క సోఫాలో కూర్చున్న గోపీచంద్ ప్రభాస్ కు దండం పెట్టి నువ్వు చాలా గొప్ప అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇవ్వడం చూస్తూ ఉంటే రాబోతున్న షో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అని అనిపిస్తోంది. షో కి సంబంధించిన ఒక్క ప్రోమో ఈ రేంజ్ లో ఉంటే మరి త్వరలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ షో ఏ రేంజ్ లో ఉంటుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -