Unstoppable 2: అడివి శేష్ పెళ్లి చేసుకోకపోవడానికి ఆ హీరో కారణమా?

Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో ఆహాలో రెండో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఓటీటీగా వచ్చిన ఆహా యమ క్రేజీగా దూసుకెళ్తోంది. ప్రేక్షకాదరణ రోజురోజుకూ పెరిగిపోతోంది. బాలకృష్ణలోని మరో కోణాన్ని అన్ స్టాపబుల్ షోలో పరిచయం చేసింది ఆహా. ఎంటర్ టైన్ మెంట్ విషయంలో రెట్టించిన ఉత్సాహంతో బాలయ్య ఈ షోలో పాల్గొంటున్నారు.

 

ఇందులో లేటెస్ట్ షోలో భాగంగా కుర్ర హీరోలు అడివి శేష్, శర్వానంద్ అతిథులుగా పాల్గొన్నారు. దీని ప్రోమో తాజాగా విడుదల చేశారు. ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇద్దరు యువ హీరోలతో బాలయ్య సందడి మామూలుగా లేదని కామెంట్లు వస్తున్నాయి. ఎంటర్ టైన్ మెంట్ కు ఏ మాత్రం కొరత లేకుండా ఈ ప్రోమో సాగింది.

 

ఫుల్ మీల్స్ ఎంటర్ టైన్ మెంట్ దొరికేసిందన్న కామెంట్లు కూడా వస్తున్నాయి. రీసెంట్ ఎపిసోడ్ లో బాలయ్య.. శర్వానంద్ ను రష్మికతో వీడియో కాల్ మాట్లాడించాడు. రష్మిక తన క్రష్ అంటూ శర్వానంద్ చెప్పడమే ఇందుకు కారణం. ఈ క్రమంలో శర్వానంద్, బాలయ్య మధ్య జరిగిన సంభాషణ కడుపుబ్బా నవ్వించేదిగా ఉంది. ఇక ఈ షోలో టాస్క్ లు కూడా బాలయ్య అప్పగిస్తుంటాడు.

 

హిందీ డైలాగులతో అదరగొట్టిన బాలయ్య..
ఇందులో భాగంగా సెల్ఫీ అడిగితే చెంప పగలగొట్టే హీరో ఎవరంటూ బాలయ్య శర్వానంద్ ను అడుగుతాడు. ఈ ప్రశ్నకు బాలయ్య నవ్వుతూ స్పందిస్తాడు. మీ జవాబును కూడా మేమే చెప్పాలా సార్ అంటూ శర్వానంద్ చిరునవ్వుతో సమాధానమిస్తాడు. దీంతో పాటు జాను సినిమా సందర్భంగా జరిగిన ప్రమాదం గురించి శర్వానంద్ వివరిస్తాడు. నాన్ స్టాప్ పంచులు, ఎంటర్ టైన్ మెంట్ తో ఇలా సాగిపోతుంది ఆ ప్రోమో. ఇక ప్రోమోనే ఇంత ఆసక్తికరంగా ఉంటే ఫుల్ ఎపిసోడ్ ఇంకెంత ఇంట్రస్టింగ్ గా ఉంటుందోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రోమోలో భాగంగా.. హిందీ డైలాగులతో అదరగొడతారు.
————-
https://youtu.be/B2725SG0m6U

Related Articles

ట్రేండింగ్

Volunteers Joined In TDP: నెల్లూరు టీడీపీలో చేరిన 100 మంది వాలంటీర్లు.. జగన్ కు ఇంతకు మించిన షాక్ ఉండదుగా!

Volunteers Joined In TDP: ఏపీలో వైయస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అన్నట్టు...
- Advertisement -
- Advertisement -