Unstoppable 2: బాలయ్య ప్రభాస్ లను ఒకే ఫ్రేమ్ లో చూస్తే రెండు కళ్లు చాలవుగా!

Unstoppable 2: స్టార్ హీరో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బాహుబలి, బాహుబలి2, సాహో సినిమాలతో ఆయన పాన్ ఇండియా స్టార్ గా మారారు. త్వరలోనే సలార్, ఆదిపురుష్ సినిమాలతో అభిమానులను ఉర్రూతలూగించడానికి సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉండగా టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అయిన బాలయ్య ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ పై ఓ షో చేస్తున్నారు. ఆహా ఓటీటీ వేదికగా ఆయన అన్ స్టాపబుల్2 టాక్ షో చేస్తూ ప్రేక్షకాదరణ పొందారు.

ఈ టాక్ షోలో బాలయ్య సెలబ్రిటీలతో పెట్టుకునే ముచ్చట్లు, చెప్పుకునే సరదా సంగతులు ఆడియన్స్ కు ఎంతగానో వినోదాన్ని పంచుతున్నాయి. అందుకే ఈ షో బాగా హిట్ అయ్యింది. కుర్ర హీరోల దగ్గరి నుంచి పెద్ద హీరోల వరకూ ఈ షోకు విచ్చేసి బాలయ్యతో ఆడిపాడారు. ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. గతాలను నెమరువేసుకున్నారు.

అన్ స్టాపబుల్2 షోలో ఇప్పటి వరకూ చాలా మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. అయితే తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్ మాత్రం భారీ స్థాయిలో అంచనాలను పెంచుతూ అందర్నీ ఆకర్షిస్తోంది. లేటెస్ట్ ఎపిసోడ్ కు బాలయ్య రెబల్ స్టార్ ప్రభాస్ ను ఆహ్వానించారు. దీనికి సంబంధించిన టీజర్ ను ఆహా ఓటీటీ సంస్థ యూట్యూబ్ లో విడుదల చేసింది.

తెలుగులో మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ అయినటువంటి ప్రభాస్ అన్ స్టాపబుల్2 షోకు విచ్చేసి అలరించారంటూ ఆహా సంస్థ పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో విడుదలైన కొంత సేపటికే లక్షల వ్యూస్ తో దూసుకెళ్తోంది. ప్రభాస్ అభిమానుల్లో ఈ టీజర్ నూతన ఉత్తేజాన్ని కలిగించింది. అన్ స్టాపబుల్2 షొలో పాల్గొన్న ప్రభాస్ లుక్ అదిరిపోయింది. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనే డైలాగ్ ను ఇప్పుడు ప్రభాస్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. మరోవైపు బాలయ్య స్టైలిష్ లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఓ వైపు బాలయ్య, మరో వైపు ప్రభాస్ లను చూసి అందరి కళ్లు చాలడం లేదని అనిపిస్తోంది. ఈ లేటెస్ట్ ఎపిసోడ్ త్వరగా రావాలని ఇద్దరి హీరోల అభిమానులు కోరుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -