Unstoppable: ఆ మ్యాటర్ గురించి పవన్ పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తాడట!

Unstoppable: నందమూరి బాలకృష్ణ రోజురోజుకీ తన పాపులారిటీ పెంచుకుంటూ పోతున్నారు. ‘అఖండ’ సినిమాకు ముందువరకు ఆయన కెరీర్ గ్రాఫ్​ పడిపోతూ వచ్చింది. అయితే ఆ ఒక్క మూవీతో ఆయన క్రేజ్ వేరే లెవల్ కు పెరిగింది. కరోనా టైమ్ లో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా లేదా అనే సందేహాల మధ్య ఆడియెన్స్ అందర్నీ బిగ్ స్క్రీన్లకు పోటెత్తించారు బాలయ్య.

 

‘అఖండ’లో బాలయ్య తనదైన శైలి నటనతో విశ్వరూపం చూపించారు. ఆయన యాక్టింగ్ లో వీరవిహారం చేశారు. దీంతో థియేటర్లకు పోటెత్తారు ప్రేక్షకులు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘అఖండ’ ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత ‘అన్ స్టాపబుల్’ టాక్ షోతో మరో సక్సెస్ ను అందుకున్నారు బాలకృష్ణ. ఈ షో మొత్తం ఇండియాలోనే నంబర్ వన్ టాక్ షోగా నిలిచింది.

 

ప్యాకేజీపై చర్చ ఉండేనా..?
ఇటీవల ప్రారంభమైన ‘అన్ స్టాపబుల్ 2’ కూడా విజయవంతంగా దూసుకెళ్తోంది. రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ షోలో హాజరయ్యారు. ఆయన తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్​ కూడా షోకు విచ్చేశారు. ఈ షోలో బాలయ్య–పవన్ మధ్య జరిగిన సంభాషణలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. వ్యక్తిగతంగా మూడు పెళ్లిళ్లు, రాజకీయంగా ప్యాకేజీ లాంటి పవన్ పై ఉన్న అలిగేషన్స్ ఈ షోలో చర్చకు వచ్చాయని వినికిడి.

 

2024 ఎన్నికల్లో టీడీపీ–జనసేన తిరిగి పొత్తు పెట్టుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్యాకేజీ వివాదంపై, టీడీపీతో పొత్తుపై ఈ షోలో పవన్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీతో తాను పొత్తు పెట్టుకున్నట్లు కనిపించాలని.. అలాంటి వ్యాఖ్యలతో ఈ షోను ఆయన వినియోగించుకున్నారని సమాచారం. ఇక పవన్ నిజంగా డబ్బులు తీసుకుని రాజకీయాలు చేస్తున్నారా అంటే.. నో అనే చెప్పాలి. కారణం ఆధారాలు లేకుండా చేసే ఆరోపణలకు విలువ ఉంటుంది. మరి, ‘అన్ స్టాపబుల్’ షోతో పవన్ ఎలాంటి కొత్త కాంట్రవర్సీలను లేవనెత్తుతారో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -