Unusual Love: పాట కలిపింది ఇద్దరినీ.. వయసుతో పనేముందంటున్న ఆ ఇద్దరు..!

Unusual Love: ప్రేమ గుడ్డిది అంటారు. పెళ్లికి వయసుకు సంబంధం లేదని మరికొందరు చెబుతారు. ప్రేమించి పెళ్లి చేసుకొనే వారి సంఖ్య ఇటీవల ఎక్కువగానే ఉంటోంది. కాలేజీలోనో, ఆఫీసుల్లోనో ప్రేమ చిగురించి తర్వాత పెద్దలు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా పెళ్లిళ్లు చేసుకొనే వారిని మనం చూస్తూనే ఉంటాం. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన కొన్ని జంటలు కూడా పెళ్లాడుతుంటారు.

ఒక్కసారి ప్రేమలో మునిగితే ఇక బయటకు రావడం కష్టంగా ఉంటుంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన వెరైటీ ప్రేమ కథ ఇది. ఇది పాకిస్తాన్‌లో జరిగింది. ఓ 18 ఏళ్ల యువతి, 50 ఏళ్లుపైబడిన వయసు కలిగిన వ్యక్తి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. చూడటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పాక్‌లో నిజంగా జరిగిన ఘటన.

పాకిస్తాన్‌కు చెందిన 18 ఏళ్ల యువతి ముస్కాన్ పాటలు బాగా పాడుతుంది. వీరి ఇంటికి ఎదురుగా ఉండే 55 ఏళ్ల ఫరూక్‌కు ఈమె పాటలు బాగా నచ్చాయి. ఆమె స్వరం వినటానికి ఉత్సాహం చూపేవాడు. అప్పుడప్పుడూ వాళ్ల ఇంటికి వెళ్లడం మొదలు పెట్టాడు. పాటల గురించి ఇద్దరూ చర్చించుకునేవారు. అలా వీరిద్దరి మధ్య పరిచయం పెరిగింది. కొన్ని రోజుల తర్వాత ఆమె బాబీ డియోల్ పాటైన నా మిలో హంసే జాదా.. అనే పాట ద్వారా తన ప్రేమను ముస్కాన్‌ వ్యక్తపరిచింది.

తనకు సంగీతం అంటే ఇష్టమని, అలా ముస్కాన్‌తో పరిచయం పెరిగిందని ఫరూక్‌ చెప్పాడు. తర్వాత ముస్కాన్ తనకు ప్రపోజ్ చేసిందని, ముందు షాక్ అయ్యాననీ, తర్వాత తాను కూడా ఆమెను ప్రేమిస్తున్నానని తెలుసుకున్నానంటూ ఫరూక్‌ తెలిపాడు. ఆమె ప్రేమ తనకు ఎంతో అమూల్యమైనదంటూ ఫరూక్ తెలిపాడు. తనపై ఫరూక్ చూపించే అభిమానం ఆకట్టుకుందని, తమ బంధాన్ని అందరూ ఏమనుకున్నా పట్టించుకోలేదని ముస్కాన్‌ చెప్పింది.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -