Uorfi Javed: బట్టలు విప్పితేనే ఇష్టం.. ఉర్ఫీ జావెద్ షాకింగ్ కామెంట్స్!

Uorfi Javed: టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా హీరోయిన్లు ఫేమస్ అవడానికి పెద్దగా ట్యాలెంట్ అక్కర్లేదు. తమ అందాలను హాట్ గా ప్రజెంట్ చేస్తే చాలు ఆటోమెటిక్ గా వాళ్లకు గుర్తింపు, ఫేమ్ వచ్చేస్తుంటాయి. ఇలా సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్న బాలీవుడ్ హాట్ బాంబ్ ఉర్ఫీ జావెద్. సినిమాల కన్నా ఆమె బయట కనిపించే విధానం నెట్టింట వైరల్ అవుతుంటుంది.

 

ఒంటి మీద ఆమె వేసుకునే డిజైన్ డ్రెస్సులు ఎంతో ట్రెండీగా ఉంటాయి. అట్ట ముక్కలతో, పేపర్లతో, గ్లాసులతో, వాచులతో, ఫోన్లతో.. ఇలా రకరకాలుగా డ్రెస్ చేసుకొని, వీలైనంత వరకు పొదుపుగా బట్టలను వాడి ట్రెండ్ అవుతుంటుంది ఉర్ఫీ జావెద్. ఆమె చేసిన సినిమాలు ఏవంటే ఎవరూ చెప్పలేరు కానీ ఆమె ఫోటోలకు మాత్రం కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటున్నారు. ఆమె ఏ కార్యక్రమానికైనా వస్తుందంటే చాలు.. ఎలాంటి డ్రెస్ లో వస్తుందో అనే చర్చ మొదలయ్యేలా ఆమె చేస్తోంది.

 

డ్రెస్ లను ఒంటి మీద నామమాత్రంగా మాత్రమే ఉంటే చాలు అనుకునేలా ఉర్ఫీ జావెద్ డ్రెస్సింగ్ సెన్స్ ఉండగా.. ఆమె ప్రస్తుతం తాను ఇలా తక్కువ బట్టలను ఎందుకు వేసుకుంటాననే విషయాన్ని వివరించింది. తాజాగా తన థైస్ మరియు చేతులు కనిపించేలా కొన్ని ఫోటోలను ఉర్ఫీ జావెద్ షేర్ చేసి.. అసలు విషయాన్ని వెల్లడించింది. దీంతో ఇన్నాళ్లు ఈమె పొట్టి బట్టలు వేసుకోవడానికి కారణం ఇదేనా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

 

తన థైస్ మరియు చేతుల మీద పింపుల్స్, దద్దుర్లు వచ్చిన ఫోటోలను నటి ఉర్ఫీ జావెద్ పోస్ట్ చేసింది. వాటిని పోస్ట్ చేస్తూ.. ‘ఇది నా పరిస్థితి. నేను నిండుగా బట్టలు వేసుకుంటే నా ఒళ్లంతా అలర్జీ వచ్చేస్తుంది. అందుకే నేను నిండుగా బట్టలు వేసుకోను’ అంటూ ఉర్ఫీ జావెద్ అసలు విషయాన్ని వివరించింది. ఈ కారణంగానే తనకు బట్టలు వేసుకోవాలంటే చిరకు వేస్తుందని ఉర్ఫీ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఉర్ఫీ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -