Upasana: అమెరికాలో ఉపాసన బంగ్లా తీసుకోవడం వెనుక ఇంత కథ ఉందా?

Upasana: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్నాడు రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఈయన క్రేజ్ రెట్టింపు అయింది. తండ్రి హోదాతో అడుగుపెట్టి మొత్తానికి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక మంచి హోదాలో ఉన్న సమయంలో ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

 

ఇక పెళ్లి తర్వాత ఈ జంట అన్యోన్య దంపతులుగా అందరి దృష్టిలో పడుతున్నారు. ఇక ఈ మధ్యనే ఉపాసన ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా బయటపడింది. ప్రస్తుతం ఆమె ఆరోనెల. ఇక ప్రెగ్నెంట్ అయి ఉన్నా కూడా ఈమె తన భర్తతో బాగా విదేశాలలో తిరుగుతూ సందడి చేస్తుంది. ఈమధ్య అమెరికాలో మాత్రం బాగా గడిపింది.

ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ తో పాటు ఉపాసన కూడా అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి లాస్ ఏంజిల్స్ లో అవార్డు సొంతం చేసుకున్న తర్వాత ఆ సినీ బృందం పార్టీ కూడా చేసుకున్నారు. ఇక రామ్ చరణ్ అక్కడ మీడియా ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ ఫుల్ బిజీ అవుతున్నాడు.

 

అక్కడి నుండి సినీ బృందం తిరిగి ఇండియాకి వచ్చిన కూడా చరణ్ దంపతులు మాత్రం లాస్ ఏంజిల్స్ లో గడుపుతున్నట్లు తెలిసింది. దీంతో ఉపాసన లాస్ ఏంజిల్స్ లో ఒక విలాసమైనంత బంగ్లాను రెంటుకు తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఆమె గర్భవతిగా ఉండటంతో కొన్ని రోజులు కంఫర్ట్ గా ఉండటానికి అంతేకాకుండా అక్కడ హెల్త్ కేర్ లో భాగంగా ఉండటానికి ఇల్లు తీసుకున్నట్లు తెలిసింది. ఇక వాళ్ళు అమెరికాకు వెళ్ళినప్పటి నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నట్లు.. ఇక కొన్ని రోజులు కూడా అక్కడే ఉండనున్నట్లు తెలిసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: చంద్రబాబు దూకుడు మామూలుగా లేదుగా.. రోజుకు మూడు సభలతో అలా ప్లాన్ చేశారా?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న పలమనేరులో ప్రజా గళం పేరిట ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను...
- Advertisement -
- Advertisement -