upasana: ఉపాసన డెలివరీ డేట్ ఇదేనా.. అందుకే ఆలస్యంగా చెప్పారా?

upasana: మెగా ఫ్యామిలీ అభిమానులకు చిరంజీవి అదిరిపోయే శుభవార్త చెప్పారు. పదేళ్లుగా నిరీక్షణలో ఉన్న అభిమానులకు తియ్యటి కబురును అందించారు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా అవతరించాడు. స్టార్ హీరోగా మంచి గుర్తింపు, పేరును సంపాదించుకుని ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. రామ్ చరణ్.. ఉపాసనను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరికి పెళ్లి అయి దాదాపు పదేళ్లు గడిచింది. ఇప్పటివరకు ఈ జంటకు పిల్లలు ఎందుకు పుట్టడం లేదనే వార్తలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వినిపిస్తూ వచ్చేవి. దీంతో అటు కుటుంబీకులు, ఇటు మెగా అభిమానులు కూడా తీవ్రంగా ఆవేదన చెందేవారు. ఈ పుకార్లన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ.. అభిమానులను ఉత్సాహపరుస్తూ చిరంజీవి మెగా వారసుడు వస్తున్నట్లు అఫీషియల్ అప్‌డేట్ ఇచ్చారు. అవును రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఉపాసన తల్లి కాబోతుందని చిరంజీవి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

 

 

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి పోస్టులో ఈ విధంగా రాసుకొచ్చారు. ‘ఆంజనేయ స్వామి దయవల్ల రామ్ చరణ్-ఉపాసన తమ మొదటి బిడ్డను ఆహ్వానించబోతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇది సంతోషకరమైన విషయం.’ అని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది సేపట్లోనే వైరల్ అయింది. టాప్ ట్రెండింగ్‌గా దూసుకెళ్తోంది. ఇన్నేళ్లు రామ్ చరణ్-ఉపాసనకు పిల్లలు పుట్టరని కామెంట్స్ చేసిన వాళ్లే.. ఇప్పుడు వీరిద్దరికీ శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా తమ విషెష్ అందిస్తున్నారు. కాగా, తాజా సమాచారం ప్రకారం ఉపాసన ఇప్పుడు మూడో నెల గర్భవతిగా ఉందట. దేవుడి దయ వల్ల అన్ని కుదిరితే.. రామ్ చరణ్-ఉపాసన పెళ్లి బంధం ముడిపడిన రోజే (జూన్ 14న) బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే రామ్ చరణ్-ఉపాసనకు ఆడపిల్ల పుడుతుందా? మగ పిల్లాడు పుడతాడా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆడపిల్ల పుడుతుందని చెబితే.. మరికొందరు పుట్టేది వారసుడేనని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Janasena: జనసైనికులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ వ్యూహాలు.. ఈ వ్యూహాల వల్ల ఫలితం ఉంటుందా?

Janasena: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీ నేతలు కూడా అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం జనసేన కూటమి...
- Advertisement -
- Advertisement -