Urvasivo Rakshasivo: ఊర్వశివో రాక్షసివో రివ్యూ

Urvasivo Rakshasivo విడుదల తేదీ : నవంబర్4, 2022

నటీనటులు : అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్, ఆమని, సునీల్, తదితరులు

నిర్మాణ సంస్థ : గీతా ఆర్ట్స్2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్

నిర్మాతలు : ఎం.విజయ్, ధీరజ్ మొగిలినేని

దర్శకత్వం : రాకేశ్ శశి

సంగీతం : అచ్చు రాజమణి

ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్

సినిమాటోగ్రాఫర్ : తన్వీర్ మిర్

 

ఈ వారం విడుదలైన సినిమాలలో భారీ అంచనాలతో విడుదలై బుకింగ్స్ విషయంలో కూడా పైచేయి సాధించిన సినిమా ఏదనే ప్రశ్నకు ఊర్వశివో రాక్షసివో సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని అల్లు శిరీష్ కెరీర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేని అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఊర్వశివో రాక్షసివో మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం.

కథ :

శ్రీ కుమార్(అల్లు శిరీష్), సింధు( అను ఇమ్మాన్యుయేల్) ఒకే ఆఫీస్ లో కలిసి పని చేస్తూ ఉంటారు. వీళ్లిద్దరూ వేర్వేరు భావాలు ఉన్న వ్యక్తులు కావడం గమనార్హం. సింధుతో ప్రేమలో శ్రీ కుమార్ ఆమెతో రొమాంటిక్ గా ఉంటూనే కొన్ని సందర్భాల్లో హద్దులు దాటుతుంటాడు. అయితే సింధు మాత్రం శ్రీ కుమార్ తో రొమాన్స్ కు ఓకే చెప్పినా అతనిని ప్రేమించదు. శ్రీ కుమార్ సింధుకు తన ప్రేమను వెల్లడించగా సింధు మాత్రం అతని ప్రేమకు అంగీకరించదు. సింధు ప్రేమను శ్రీ ఎలా గెలుచుకున్నాడు? ఈ క్రమంలో ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించుకున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

విశ్లేషణ :

దర్శకుడు రాకేశ్ శశి కమర్షియల్ సినిమాలను బాగానే తెరకెక్కిస్తాడని పేరు ఉన్నా ఇప్పటివరకు డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకోలేదు. ఊర్వశివో రాక్షసివో సినిమాకు యూత్ కు నచ్చేలా తెరకెక్కించిన రాకేశ్ శశి ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అను ఇమ్మాన్యుయేల్ తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయగా సినిమాలోని కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నాయి.

సాంకేతిక నిపుణుల పనితీరు :

అచ్చు రాజమణి మ్యూజిక్, బీజీఎం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్ గా పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. తన్వీర్ మిర్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకునేలా ఉంది. రాకేశ్ శశి టాలెంట్ ఉన్న నిపుణులను ఎంచుకున్నారు.

ప్లస్ పాయింట్లు :

అను ఇమ్మాన్యుయేల్ నటన

కథ, కథనం

రాకేశ్ శశి డైరెక్షన్

మైనస్ పాయింట్స్ :

కొన్ని సన్నివేశాల్లో కొత్తదనం లేకపోవడం

అల్లు శిరీష్ నటన

మాస్ ప్రేక్షకులకు నచ్చే సన్నివేశాలు లేకపోవడం

యూత్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం మాత్రమే

రేటింగ్ : 2.75/5.0

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -