UttarPradesh: భర్తను చంపి శవం పక్కనే పడుకున్న భార్య.. తెల్లారేసరికి?

UttarPradesh: తాజాగా ఉత్తరప్రదేశ్లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీలో అన్నూ, అతుల్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. కొంతకాలానికి ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. అతుల్ స్థానికంగా పని చేస్తుండగా, భార్య బ్యూటీపార్లర్ ను నడిపిస్తుంది. ఇక ఈ దంపతులు ఇద్దరూ సంపాదిస్తుండడంతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాలేదు. అలా వీరి కాపురం సజావుగానే సాగుతూ వచ్చింది. అయితే కొన్ని రోజుల తర్వాత అతుల్ తాగుడుకు బానిస అయ్యాడు. రోజూ తాగి ఇంటికి రావడం, భార్యతో గొడవ పడడం ఇలా గత కొద్దీ రోజులుగా ఇలా జరుగుతోంది.

 

అతుల్ రోజూ సంపాదించిన డబ్బును అంతా తాగుడుకే ఖర్చు పెట్టేవాడు. దాంతో అన్నూ భర్తకు అనేక సార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ భర్త ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు పోవడంతో ఏం చేసి మార్పు తేవాలి అని తరచుగా బాధపడుతూ ఉండేది. ఇదిలా ఉంటే ఇటీవలే ఈ నెల 15న భర్త అతుల్ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఇంతటితో ఆగక భార్య అన్నూతో గొడవపడి ఆమె పై దాడి చేశాడు. ఇక ఆగడాలు తట్టుకోలేకపోయిన భార్య కోపంతో ఇంట్లో ఉన్న కర్రతో భార్త పై దాడి చేసింది. ఈ దాడిలో భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భర్త మరణించాడని తెలిసినా భార్య అతని శవం పక్కనే రాత్రంతా పడుకుంది.

 

తెల్లారేసరికి భార్య అన్నూ ఎవరికి తెలియకుండా ఇంటికి తాళం వేసి ఎప్పటిలాగే బ్యూటీ పార్లరర్ కు వెళ్లింది. కానీ ఎందుకో స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ దంపతుల ఇంటికి చేరుకుని అతుల్ మృతదేమాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసులు భార్య అన్నూను విచారించారు. ఏం తెలియనట్టుగా నటించిన భార్య అతిగా మద్యం సేవించే నా భర్త చనిపోయాడని పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో అతుల్ భార్యపై అనుమానం వచ్చిన పోలీసులు గట్టిగా నిలదీయడంతో అన్నూ అసలు నిజాలు బయట పెట్టింది. తన భర్త రోజూ మద్యం తాగి హింసిస్తున్నాడని, అందుకే నా భర్తను చంపానని తెలిపింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్య అన్నూను అరెస్ట్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -