Uttej: కూతురుపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఉత్తేజ్.. ఏమైందంటే?

Uttej: నటుడు ఉత్తేజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన పని లేదు. 90లలో మూవీల నుంచి ఇప్పటి వరకు అనేక చిత్రాల్లో నటించారు. అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు పొందారు. నటుడిగానే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్, రైటర్ గానూ ఉత్తేజ్ గుర్తింపు పొందారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జెర్నీలోని విశేషాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా తన గురించి, తన కుమార్తె నట జీవితం గురించి అనేక విషయాలు తెలిపారు ఉత్తేజ్.

తన కుమార్తె చేతన గురించి ప్రస్తావన రాగా బద్రి సినిమాలో నటించిన సీన్ ను యాంకర్ చూపించి పలు ప్రశ్నలు అడుగుతుంది. ఆ మూవీలో పవన్ కల్యాణ్ వద్దకు వచ్చిన ఓ చిన్నారి.. నీ పేరేంటి.. ఎందుకు డల్ గా ఉన్నావ్ అని అడుగుతుంది. అప్పుడు పవన్ కల్యాణ్, ఆ చిన్నారి మధ్య జరిగే సీన్ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సీన్ లోని పాప నేడు హీరోయిన్ గా చేస్తోంది. ఆమే ఉత్తేజ్ కుమార్తె చేతన.

చేతన బాగా చేసిందనే మాట వినిపించాలి..

ఈ సందర్భంగా చేతన గురించి ఉత్తేజ్ ను పలు ప్రశ్నలు అడుగుతుంది యాంకర్. పూర్తి స్థాయి హీరోయిన్ గా ఎప్పుడు తయారు చేస్తున్నారన్న ప్రశ్నకు పిచ్చిగా నచ్చావ్ అనే సినిమాలో ఇప్పటికే హీరోయిన్ గా చేసిందని ఉత్తేజ్ బదులిస్తాడు. ఉత్తేజ్ కూతురు బాగా చేసిందనే మాట తనకు వినిపించకూడదని చెబుతాడు ఉత్తేజ్. అలా అంటే తన కూతుర్ని చచ్చిపోమని చెప్పానని ఉత్తేజ్ బదులిస్తాడు. చేతన బాగా చేసిందంటేనే తనకు సంతృప్తి కలుగుతుందన్నాడు.

ఇక ఉత్తేజ్ పూర్తి స్థాయి డైరెక్టర్, పూర్తి స్థాయి నటుడిగా ఉండటం తాను ఇష్టపడతానని తెలిపాడు. సినిమాలే తన ప్రపంచమని, సినిమా లేకపోతే తాను చచ్చిపోతానని చెప్పాడు ఉత్తేజ్. సినిమా రంగం అనేది ఒక టైమ్ మిషన్ లాంటిదని చెప్పాడు. ఒక సినిమాలో మనం నటిస్తే కొన్ని వందల సంవత్సరాలు మనం బతికుంటామన్నాడు. ఓ సినిమా వెనక్కి వెళ్తే మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆర్థిక వ్యవస్థ, ఇలా అన్నీ బయటకు వస్తాయని తెలిపాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: కుప్పంలో గెలుపు కోసం చంద్రబాబు వ్యూహాలివే.. ఎదురుగాలి వీస్తోందని అలా చేస్తున్నారా?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రజా గళం పేరిట పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే గత కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు కుప్పంలో...
- Advertisement -
- Advertisement -