Valtheru Veerayya: చిరు మూవీ ఫస్ట్ సాంగ్‌పై క్రిటిక్ కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

Valtheru Veerayya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోని ‘బాస్ పార్టీ’ సాంగ్ రీసెంట్‌గా విడుదలైంది. ఈ సాంగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఆరంభంలో ‘నువ్వు లుంగీ ఎత్కో.. హేయ్.. నువ్వు షర్ట్ ముడేస్కో.. హేయ్..’ అంటూ పాటను ప్రారంభించారు. ఆ తర్వాత ‘బాస్ వస్తుండు.. బాస్ వస్తుండు..’ అంటూ హీరోను ఎలివేట్ చేస్తూ పాటను వివరించారు. ఈ సాంగ్‌లో మెగాస్టార్ మాస్ గెటప్‌లో డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. షూటింగ్ విజువల్స్ తోపాటు కొన్ని స్టెప్పులు యాడ్ చేసి వీడియోను రిలీజ్ చేశారు. అయితే ఈ వీడియోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షూటింగ్ స్పాట్‌లో వచ్చిన పిక్ కూడా ఉంది. ఈ వీడియోను చూసిన మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. మైత్రీ మూవీస్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. వై.రవిశంకర్, నవీన్ యెర్నేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

 

వాల్తేరు వీరయ్య ఫస్ట్ సాంగ్ బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన దాసరి విజ్ఞాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వాల్తేరు వీరయ్య సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాటలో మెగాస్టార్‌ చేసిన స్టెప్పులు బాగానే ఉన్నాయి. శేఖర్ మాస్టర్ కంపోజింగ్ అదిరిపోయింది. సెట్ బ్యాక్‌గ్రౌండ్ కూడా బాగుంది. పాటలో నటించిన నటి కూడా ఇరగదీసింది. అయితే ఫస్ట్‌ లో ఐటమ్ సాంగ్ అనుకున్న.. కానీ స్పెషల్ సాంగ్. ఈ సాంగ్ చూస్తే.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఓ పాటలా అనిపించింది. కొన్ని సినిమాల పాటలను కలిపి సాంగ్ రాసినట్లు ఉంది. ఈ సాంగ్‌లో మరీ కొత్తదనం ఏమీ లేదు. రొటిన్ సాంగ్‌లా ఉంది. అయినా మెగాస్టార్ పర్ఫార్మెన్ బాగుంది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ పాటకు న్యాయం చేసినట్లు కనిపించడం లేదు. సింగర్స్ కూడా వాయిస్ బేస్ అక్కడక్కడ తగ్గినట్లు ఉంది. ఈ సాంగ్ కంటే జారు మిఠాయి సాంగ్ బెటర్ అనిపిస్తోంది.’ అని షాకింగ్ కామెంట్లు చేశాడు.

 

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -