Pawan kalyan: డబ్బు కంటే విలువలే ముఖ్యం.. పవన్ సిద్ధాంతమిదే!

Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోగా ఉన్నారు. ఆయన సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు థియేటర్లు హౌస్ ఫుల్ అవ్వాల్సిందే. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకు ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాన్ అటు సినిమాలు చేస్తూనే ఇటు రాజకీయాలలో రాణిస్తున్నారు. గత రెండు ఎన్నికలలో ఆయన బరిలోకి దిగారు. అయితే ఆయన ఓటమి పాలయ్యారు.

 

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి చేరువవుతోంది. ఏపీ వ్యాప్తంగా జనసేనకు ఆదరణ పెరుగుతోంది. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కార దిశగా పవన్ కళ్యాణ్ సాగుతున్నారు. పవన్ కళ్యాణ్ కు డబ్బుకంటే విలువలంటేనే ముఖ్యం. కొన్ని వేదికలపై ఆయన ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పారు.

చాలా మంది పవన్ కళ్యాణ్ ను ఎన్నో విమర్శలు చేశారు. ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలని, పబ్లిసిటీ కోసం రాకూడదని అన్నారు. అలాగే సినిమాల్లో కంటే రాజకీయాల్లో ఎక్కువ డబ్బులు, ప్యాకేజీలు వస్తాయని పవన్ ఆర్భాటం చేస్తున్నారని ఆయన ప్రత్యర్థులు కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వాటికి ఎప్పటికప్పుడు పవన్ సమాధానం చెబుతూ వస్తున్నారు.

 

తాజాగా పవన్ కళ్యాణ్ గురించి ఓ విషయం తెలిసింది. పవన్ ప్రజల కోసం పని చేస్తారని, ఆయన డబ్బు కన్నా విలువలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని మరోసారి స్పష్టం అయ్యింది. టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాత సంస్థలో వరుసగా మూడు సినిమాలలో నటిస్తే సింగిల్ పేమెంట్ లో 300 కోట్ల రూపాయలు ఇస్తామని పవన్ కు ఆఫర్ వచ్చిందట. అయితే పవన్ మాత్రం తనకు డబ్బు ముఖ్యం కాదని నాకు నచ్చిన ప్రాజెక్ట్ లే చేస్తానని ఇలాంటి కాంట్రాక్ట్ లు తనకు నచ్చవని తెలిపారట. అంతేకాదు ఆయన డబ్బుకన్నా విలువలకు, స్నేహానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని తెలిపినట్లు సమాాచారం.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -