Vanishree: పోయిందనుకున్న ఆస్తిని ముఖ్యమంత్రి ద్వారా సంపాదించుకున్న నటి వాణిశ్రీ!

Vanishree: తెలుగు సినీ ప్రియులకు అప్పటి నటి వాణిశ్రీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అప్పటి టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి నటిగా తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకుంది. ఇక వాణిశ్రీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఏదేమైనా అప్పట్లో వాణిశ్రీ నటనపరంగా ఒక రేంజ్ లో హడావిడి చేసింది. ఇదిలా ఉంటే వాణిశ్రీ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో హడావిడి చేస్తుంది.

అదేమిటంటే వాణిశ్రీ కి సంబంధించిన 20 కోట్ల విలువగల భూమిని కొందరు నకిలీ పత్రాలతో సొంతం చేసుకున్నారు. ఇక ఈ నకిలీ పాత్రాలను రద్దు చేసిన స్టాలిన్ ప్రభుత్వం ఆ భూమిని తిరిగి నటి వాణిశ్రీ కి అందించింది. అంతేకాకుండా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వాణిశ్రీ కి తన పత్రాలు అందించాడు. భూమి పత్రాలు కోసం సచివాలయానికి వచ్చిన వాణిశ్రీ మాట్లాడుతూ.. 20 కోట్ల విలువైన తన భూమిని నకిలీ పత్రాలతో కబ్జా చేశారు అని తెలిపింది.

ఈ విషయం తెలిసే తన ఆస్తి మొత్తం పోయిందని వాణిశ్రీ అనుకుందట. ఇక ఆ ఆస్తి గురించి అశలు కూడా వదిలేసుకున్నాను అని తెలిపింది. ఇక స్టాలిన్ ప్రభుత్వం గత సంవత్సరం నకిలీ పత్రాల ద్వారా జరిగిన భూరిస్టేషన్ లు రద్దు చేసే అధికారాన్ని తీసుకువచ్చింది. భూమిని ఇప్పించడానికి సీఎం స్టాలిన్ తనకు బాగా సహాయపడ్డారని వాణిశ్రీ తెలిపింది. భూమి విషయంలో చాలా విసుగు చెందిన వాణిశ్రీ ఇకపై భూమి కోసం పైసా కూడా ఖర్చు పెట్టకూడదు అని నిర్ణయించుకుంది.

ఆ సమయంలో వాణిశ్రీ కి తన భూమిని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తిరిగి ఇప్పించారని వాణిశ్రీ తెలిపింది. అంతేకాకుండా తనకు ఈ విషయంలో ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అన్నట్లు తెలిపింది. ఇక స్టాలిన్ చల్లగా ఉండాలి అంటూ ఆయన ఇటువంటి మంచి పాలనా అందిస్తూ ఉండాలని వాణిశ్రీ పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -