Varalaxmi Sarathkumar: షాకింగ్ కామెంట్స్ చేసిన వరలక్ష్మీ శరత్ కుమార్

Varalaxmi Sarathkumar: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే చాలా కష్టపడాలి. తమను స్క్రీన్ పై చూసుకోవాలని చాలా మంది ముద్దుగుమ్మలకు ఆశ అనేది ఉంటుంది. కానీ కొందరు మాత్రం దానికి తగినట్లు ఎఫర్ట్ పెట్టలేరు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలంటే మాత్రం ఎన్నో కాంప్రమైజ్ లు అవ్వాల్సి ఉంటుంది. అయితే స్టార్ హీరోయిన్లకు మాత్రం అటువంటి కష్టాలు అనేవి అంతగా ఉండవు. కానీ స్టార్ డాటర్స్ కూడా అలాంటి కష్టాలు కచ్చితంగా పడాల్సి ఉంటుందని నటి వరలక్ష్మి శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

 

హీరో శరత్ కుమార్ మొదటి భార్య కూతురుగా వరలక్ష్మి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో రాణిస్తోంది. ఆమె ఇండస్ట్రీలో హీరోయిన్ గా చేసిన సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి. హీరోయిన్ గా ఆమె హిట్ కొట్టింది తక్కువనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్స్ రోల్స్ కి స్వస్థి పలికి విలన్ పాత్రలకు చేయడం మొదలు పెట్టింది. తాజాగా వీర సింహారెడ్డి సినిమాలో కూడా ఆమె నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది.

 

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇలా విలన్ రోల్స్ చేయడం ఏంటని ఆమెను యాంకర్ ప్రశ్నించడంతో ఆమె దానికి సమాధానం చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలంటే గ్లామరస్ గా ఉండాలని, అప్పుడే హీరోయిన్ ను ప్రపంచమంతా చూస్తుందని, అలాంటి గ్లామర్ తలనొప్పులు భరించలేక తాను ఇలా విలన్ రోల్స్ చేసుకుంటూ పోతున్నానని షాకింగ్ కామెంట్స్ చేశారు.

 

ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా త్వరలోనే వరలక్ష్మి శరత్ కుమార్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న ఎన్టీఆర్ థర్టీ సినిమాలోనూ విలన్ పాత్ర చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగా అది నిజమే అయితే మాత్రం వరలక్ష్మి శరత్ కుమార్ కచ్చితంగా ఆ సినిమాతో మరో హిట్ కొట్టినట్టేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chamundeshwari Stotram: ఈ స్తోత్రం చదివితే కష్టాలు కచ్చితంగా తీరతాయి.. దేవి అనుగ్రహంతో?

Chamundeshwari Stotram: కష్టం వస్తే దేవుని వైపు చూడడం మానవుని సహజలక్షణం. అందులోని అమ్మవారి స్తోత్రాలు మరింత శ్రేష్టమైనది. అందులోనే చాముండేశ్వరి మంగళ స్తోత్రం కూడా ఒకటి. ఈ స్తోత్రం చదివితే కష్టాలు...
- Advertisement -
- Advertisement -