Varsha: పిల్లల్ని కంటామని చెప్పిన వర్ష ఇమ్మాన్యుయేల్.. ఎంత ప్రేమో?

Varsha: తెలుగు బుల్లితెర మీద బాగా పాపులర్ అయిన జంటల్లో వర్ష, ఇమ్యానుయేల్ ఒకటి. జబర్దస్త్ వేదికగా వీరిద్దరు ఒకరికొకరు లవ్ ప్రపోజల్స్ చేసుకుంటూ ఎప్పుడూ ప్రోగ్రాం రేటింగ్ పెంచుతూ ఉంటారు. రియల్ లవ్ ఉందో లేదో కానీ ఇద్దరు మాత్రం కెమెరా ముందు తెగ హల్ చల్ చేస్తూ ఉంటారు. తాజాగా వర్ష కోసం ఇమ్మాన్యుయేల్ ఓ నెక్లెస్ కొనడం వార్తల్లో నిలిచింది.

వచ్చే నెలలో వర్ష బర్త్ ఉండగా.. అందుకు అడ్వాన్స్ గా ఇమ్ము వర్షకి సిల్వర్ నెక్లెస్ ని ఇప్పించాడు. అయితే ఇమ్ము వ్లాగ్ వీడియోలో ఇందుకు సంబంధించిన విజువల్స్ ను షేర్ చేశాడు. హైదరాబాద్ లో కొత్త ఏర్పాటు చేసిన ఓ సిల్వర్ జువెలరీ షోరూంలో వర్ష కోసం నెక్లెస్ కొంటూనే ఇమ్ము.. ఆ షోరూంకి కావాల్సిన పబ్లిసిటీ చేసేశాడు. దీంతో స్వామి కార్యం, స్వకార్యం జరిగినట్లుందని అందరూ కామెంట్ చేస్తున్నారు.

కాగా వచ్చే నెలలో ఉన్న తన బర్త్ డేకు ఇప్పుడే గిఫ్ట్ ఇస్తానని తాను ఊహించలేదని వర్ష ఉబ్బితబ్బిబ్బైపోయింది. అయితే షోరూంకు రాగానే వర్ష.. ఇమ్మూతో.. ‘గోల్డ్ ఇస్తే ఎక్కువ అవుతుందని ఇక్కడికి తీసుకొచ్చావా?’ అని అంటుంది దానికి ఇమ్ము ‘నీకు గోల్డ్ కూడా ఉందిరా. అది ఇప్పుడు కాదు, మన పెళ్లికి. పెళ్లి షాపింగ్ కూడా చేస్తామండి త్వరలోనే. మా పిల్లల్ని కూడా చూపిస్తాం’ అని పంచ్ వేస్తాడు.

చివర్లో వర్ష కోసం ఇమ్ము సిల్వర్ నెక్లెస్ కొనిచ్చి.. ‘ఇది నీ బర్త్‌డే గిఫ్ట్ రా.. ఇప్పటికిప్పుడు హగ్ చేసుకుని ముద్దులు పెట్టుకోవడం అందరి ముందు వద్దు. మిగతా ఏమైనా ఉంటే తరవాత చూసుకుందాం’ అని అంటాడు. మొత్తానికి జబర్దస్త్ షో కాకుండా బయట ఇమ్ము ఇలా వర్షకి నెక్లెస్ కొనివ్వడంతో.. వీరిద్దరు నిజంగా లవ్ లో ఉన్నారనే టాక్ నడుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

News Arena India: మళ్లీ జగనే సీఎం.. మరో సంచలన సర్వే.. న్యూస్ ఎరేనా సర్వేలో వైసీపీ సీట్ల లెక్క ఇదే!

News Arena India: ఏపీలో అధికార వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఆ పార్టీ అధినేత జగన్ తనదైన సిద్దం సభలను మొదట నిర్వహించి పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఆ తర్వాత...
- Advertisement -
- Advertisement -