Varun Gandhi: వైరల్ అవుతున్న వరుణ్ గాంధీ సంచలన ట్వీట్!

Varun Gandhi: ఒడిస్సాలో జరిగిన రైలు ప్రమాద ఘటన అందరినీ ఎంతగానో కలిసి వేస్తుంది. ఒకేసారి మూడు రైళ్లు ఢీకొనడంతో రైళ్లలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు అందరూ ఒక్కసారిగా చెల్లాచెదురైపోయారు. వందల మంది ప్రాణాలను కోల్పోగా వేల సంఖ్యలో ప్రయాణికులు ఆసుపత్రి పాలయ్యారు. ఈ హృదయ విదారక ఘటన అందరిని ఎంతగానో కలచి వేసిందని చెప్పాలి.

ఈ విధంగా ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించి బాధితులకు నష్టపరిహారం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఈ రైలు ప్రమాదంలో మరణించిన ఒక్కొక్కరికి కేంద్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు.అలాగే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రెండు లక్షలు స్వల్పంగా గాయపడిన వారికి 50 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.

 

అలాగే సంఘటన స్థలానికి ప్రధానమంత్రి చేరుకొని అక్కడ పరిస్థితులను ఆరా తీశారు. అలాగే ఆసుపత్రికి వెళ్లి బాధ్యతలను కూడా పరామర్శించారు. ఇక ఈ ప్రమాదానికి కారణమైనటువంటి వారిని అస్సలు ఉపేక్షించేది లేదని వారికి కఠినమైన చర్యలు తప్పవని ప్రధాని వెల్లడించారు. ఇక కేంద్ర ప్రభుత్వం బాధితులకు పెద్ద ఎత్తున నష్టపరిహారాన్ని ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బిజెపి ఎంపి వరుణ్ గాంధీ ఈ ఘటనపై స్పందించి చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

 

ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం హృదయ విదారకరం.. మన జీతంలో కొంత భాగాన్ని బాధిత కుటుంబాలకు ఇచ్చి వారిని ఆదుకోవాలని నాతోటి ఎంపీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్లకి ముందు మద్దతు ఇవ్వాలి. తర్వాత న్యాయం జరగాలని కోరుతూ ఈయన చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -