Vasthu: ఈ పక్షి ఫోటో మీ ఇంట్లో ఉందా.. అయితే మీకు తిరుగులేదు?

Vasthu: సాధారణంగా మనం నిత్యం ఎన్నో రకాల పక్షులను చూస్తూ ఉంటాం. అయితే పెద్ద పెద్ద నగరాలలో పక్షులు అంతగా కనిపించకపోవచ్చు కానీ పల్లెటూరి ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మనం తరచుగా చూసే పక్షులలో గుడ్లగూబ కూడా ఒకటి. ఇతర పక్షులతో పోల్చుకుంటే గుడ్లగూబ లను ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు. మనుషుల్లో నాలెడ్జ్ ను పెంచే లక్ష్మణ్ గుడ్లగూబలకు ఉంది అని పరిశోధనలో కూడా తేలింది. గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం అన్న విషయం మనందరికీ తెలిసిందే. చాలా తక్కువ మంది గుడ్లగూబ ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు.

 

పురాణాల ప్రకారం గుడ్లగూబలను మేతస్సును పెంచే పక్షులుగా తెలియని ప్రపంచానికి తీసుకెళ్లే మార్గదర్శినులుగా కూడా తెలిపారు. గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం కాబట్టి ఎవరైతే గుడ్లగూబను ఇంటిలో పెంచుకుంటారో లేదా గుడ్లగూబ ఫోటోని ఇళ్లలో పెట్టుకుంటారో వారి పట్ల అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అలాగే వారికి ధనప్రాప్తి కలుగుతుంది. కాగా గుడ్లగూబ కళ్లలో కళ్లు పెట్టి చూస్తే మన జీవితంలో మార్పులు రావడం ఖాయం. కారణం దాని కళ్లలో ఉన్న శక్తే. రోజూ దాదాపు 10 నిమిషాలపాటూ గుడ్లగూడ కళ్లు ఉండే ఫొటోను చూస్తే లోతుగా, నిశితంగా, స్పష్టంగా, కచ్చితత్వంతో ఆలోచించే అలవాటు పెరుగుతుంది.

 

గుడ్లగూబ కళ్లలోకి కళ్లు పెట్టి దాదాపు 10 నిమిషాలు చూడాలి. ఆ తర్వాత ఈ ప్రపంచాన్ని మనం చూసే కోణం మారుతుంది. ప్రతీదీ నిశితంగా ఏకాగ్రతతో చూస్తామని పరిశోధనల్లో తేలింది. గుడ్లగూబ కళ్లు… గుండ్రంగా, సూటిగా ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆ కళ్లను తదేకంగా చూస్తామో ప్రతీదీ తదేకంగా చూడటం అలవాటవుతుంది. అందువల్ల మిగతా వారి కంటే మనం లోతుగా చూడగలం. గుడ్లగూబలు చీకట్లో కూడా స్పష్టంగా చూడగలవు. కానీ మనం అలా చూడలేం. కానీ వాటి కళ్లను నిశితంగా చూడటం వల్ల మన మెదడులో చూపుకి సంబంధించిన భాగాలు మరింత చురుకుగా మారతాయి. నిర్ణయాలు తీసుకోవడంలో కచ్చితత్వం పెరుగుతుంది. అయితే లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగూబ కేవలం ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంతో పాటుగా మన జ్ఞానానికి మేధస్సుకు సంబంధించిన ఎన్నో విషయాలను పెంచడంలో గుడ్లగూబ బాగా ఉపయోగపడుతుంది.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -