Vastu: వాస్తు దోషాలు తొలగిపోవాలా.. అయితే ఈ వస్తువులను ఇంట్లో ఉంచాల్సిందే?

Vastu: భారతదేశంలో వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే కొందరు వాస్తు శాస్త్రాన్ని మూఢనమ్మకాలు అని కొట్టి పారేస్తుంటే మరి కొందరు మాత్రం వాస్తు శాస్త్రాన్ని నమ్మడంతో పాటు అందులో చెప్పిన పరిహారాలను పాటిస్తూనే ఉన్నారు. వాస్తు శాస్త్రంలో చెప్పిన పరిహారాలను. పాటించడం వల్ల ఆరోగ్యంగానే కాకుండా ఆర్థికంగా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. అంతే కాదండోయ్ వాస్తు చిట్కాలను ఉపయోగించి వాస్తు దోషాలను కూడా తొలగించుకోవచ్చు. అయితే కొంతమంది ఎటువంటి పని మొదలుపెట్టిన కూడా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి.


అంతేకాకుండా పేదరికం ఆర్థిక సంక్షోభం నెలకొంటూ ఉంటుంది. కుటుంబంలోని వ్యక్తులు అనారోగ్యం పాలవుతూ ఉంటారు. వీటినుంచి బయటపడాలి అంటే మన ఇంట్లో రెండు రకాల వస్తువులు పెట్టడం తప్పనిసరి. మనం ఇంట్లో ఉండే ఉప్పు ,పటికతో వాస్తు దోషాల నివారణ సాధ్యం అవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు నీటితో ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రం చేసినట్టయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. దీని వల్ల ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయి. అదే విధంగా మరుగుదొడ్డి తప్పు దిశలో ఉండటం వల్ల వాస్తు దోషం కలుగుతుంది. అప్పుడు ఒక గాజు గిన్నెలో ఉప్పు మొత్తం ఉంచడం వల్ల వాస్తు దోషం నివారణ జరుగుతుంది.

ప్రతి రెండు నెలలకోసారి గిన్నెలో ఉప్పును మారుస్తూ ఉండాలి. ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని నాశనం చేయడానికి ప్రతి మూలలో ఒక గాజు ప్లేట్‌లో రాతి ఉప్పును పెట్టాలి. దీనివలన పాజిటివ్ ఎనర్జీ వ్యాపించి ఇంట్లో ఆనందం,శ్రేయస్సు వెల్లివిరుస్తుంది. ఇక ఇంట్లో వాస్తు దోషం ఉందని తెలిస్తే దాని నివారణకు కిటికీ లేదా తలుపు దగ్గర గాజు ప్లేట్‌లో చిన్న పటిక ముక్కలను ఉంచాలి. ప్రతి నెలకు ఒకసారి అందులో పటికను మారుస్తూ ఉండాలి. దీంతో వాస్తు దోషాలు తొలగిపోతాయి. అదే విధంగా ఇంట్లోని వ్యక్తులకు అదే పనిగా పీడకలలు వచ్చినప్పుడు పటికను మీ మంచం లేదా తల దగ్గర గాజు ప్లేట్‌లో ఉంచుకుంటే పీడకలలు రావడం ఆగిపోతాయి.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -