Vastu Rules: ధనవంతులు కావాలంటే ఇలా చేయాలి!

Vastu Rules: ప్రస్తుతం పట్టణీకరణ విపరీతంగా పెరిగిపోయింది. నగరాలు, పట్టణాల్లో జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. గ్రామాల్లో నివసించే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో పట్టణాలు, నగరాల్లో సొంత ఇంటి కల అనేది చాలా కష్టంతో కూడినది. సొంతింట్లో ఉండాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. అయితే, ఇండిపెండెంట్‌ ఇల్లు కొనడం చాలా మంది సాధ్యం కాదు. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్లలో ఇల్లు కొనుక్కుంటూ ఉంటారు.

 

ఇండిపెండెంట్‌ హౌస్‌ చాలా ఖరీదుగా ఉండటమే ఇందుకు కారణం. అందుకే అపార్ట్‌మెంట్లలో కొనేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తారు. అయితే, ఇల్లు కొనేముందు చాలా చూసుకోవాలి. వాస్తు, ధర, ప్రధాన ద్వారం ఇవి ముఖ్యంగా గమనించుకోవాలని చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం అపార్ట్‌మెంట్లో ఏ అంతస్థులో ఇల్లు తీసుకోవాలనే సందేహం చాలా మందికి కలుగుతూ ఉంటుంది. ఇందుకోసం వాస్తు పండితులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

 

అపార్ట్‌మెంట్‌లో ఇల్లు కొనుగోలు చేసే వారు ముందుగా వాస్తు ప్రకారం ఏ అంతస్తు మంచిదో తెలుసుకోవాలి. వాస్తు ప్రకారం తీసుకోవడం వల్ల ఇంట్లో ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. సిరిసంపదలు ఏర్పడతాయి. ఈ క్రమంలో వాస్తు శాస్త్రం ప్రకారం గ్రౌండ్‌ ఫ్లోర్‌ మంచిదని పండితులు చెబుతున్నారు. వాస్తులో ఇంటిని భూమితో అనుసంధానం చేయడం అంటే ప్రకృతితో అనుసంధానం చేయడమేనని చెబుతారు.

 

వాస్తు ప్రాథమిక నియమం ప్రకారం గ్రౌండ్‌ ఫ్లోర్‌ బెటరని చెబుతున్నారు. ఇక అందరికీ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి.. ఎత్తయిన భవనంలో ఇల్లు తీసుకోవాలనుకొనే వారికి ఐదు అంతస్తుల్లోపు ఇంటిని తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. దాంతోపాటు ఫస్ట్‌ ఫ్లోర్‌ కూడా మంచిదని చెబుతున్నారు. మొదటి అంతస్తులో తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వాస్తు ప్రయోజనాలు కూడా చాలా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. నంబర్‌ 1 సంఖ్యకు చాలా ప్రాధాన్యం ఉన్నట్లే మొదటి ఫ్లోర్‌లో తీసుకోవడం వల్ల చాలా మంచి శుభాకలు కలుగుతాయని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -