Vastu Tips: వాస్తు ప్రకారం ఈ విగ్రహాలు ఇంట్లో ఉంటే అదృష్టమే అదృష్టం!

Vastu Tips: మనముండే ఇంట్లో వాస్తు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వాస్తు అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ. వాస్తు సరిగ్గా ఉంటే ఇంట్లో ప్రతి ఒక్క విషయంలో పాజిటివ్ ఎనర్జీ బాగా కనిపిస్తుంది. అలా ఇల్లు నిర్మించినప్పుడు ద్వారాల నుంచి గదుల వరకు వాస్తు కచ్చితంగా చూస్తూ ఉంటారు. కేవలం వీటివల్లే కాకుండా ఇంట్లో పెట్టుకునే వస్తువులలో కొన్ని వాస్తు శాస్త్రాలు ఉంటాయి. ఆ వస్తువులు వాస్తు ప్రకారం పెడితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లేదంటే కొన్ని ప్రభావాలు ఎదురవుతాయి. అయితే ఈ విగ్రహాలు ప్రకారం ఉంటే మాత్రం అదృష్టం మన వెంటే ఉంటుంది. ఇంతకీ ఆ విగ్రహాలు ఏంటో తెలుసుకుందాం.

ఏనుగు విగ్రహం: ఇంట్లో ఏనుగు విగ్రహం ఉండటం వల్ల అంతా మంచే జరుగుతుంది. ఏనుగు సంపదకు గుర్తుగా పరగణిస్తారు. అంతేకాకుండా పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఏనుగుని పడకగదిలో ఉంచడం వల్ల వైవాహిక జీవితంలో కూడా ఆనందాలు ఉంటాయి.

గుర్రపు విగ్రహం: ఇంట్లో గుర్రపు విగ్రహాన్ని ఉంచడం వల్ల మంచి బలం ఉంటుంది. చేపట్టిన పనులలో విజయం అందుతుంది. ఉత్తర దిశలో ఈ విగ్రహం పెట్టడం వల్ల అన్ని రంగాలలో విజయం కలుగుతుంది. కుటుంబ సభ్యులు ఎప్పుడు సంతోషంగానే కనిపిస్తారు.

హంస విగ్రహం: హంస విగ్రహం జంటగా ఉండటం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులు ఆనందంతో ఉంటారు. వాస్తు ప్రకారం ఈ విగ్రహమును నైరుతి దిశలో ఉంచాలి. అంతేకాకుండా విజయం కూడా తోడు ఉంటుంది.

ఆవు, దూడ విగ్రహం: ఇక ఆవు దూడ కలిపి ఉన్న విగ్రహం ఉంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇంట్లో పిల్లలు చదువులో ఆసక్తి చూపిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది.

తాబేలు విగ్రహం: ఇంట్లో తాబేలు విగ్రహం ఉండటంవల్ల డబ్బు విషయంలో లోటు ఉండదు. వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలును తూర్పు, ఉత్తర దిశలో పెట్టడం వల్ల ఆర్థికలాభాలతో పాటు సంతోషాలు కూడా ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -