Vastu Tips: మీ ఇంట్లో మహాదేవుడి ఫోటో ఉందా ?అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి!

Vastu Tips: శ్రావణ మాసం అంటేనే శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో భక్తులు శివుడి ఆరాధన చేస్తారు. ఈ మాసంలో శివుడు అత్యంత ప్రసన్నుడుగా ఉంటాడు. కాబట్టి శివానుగ్రహం లభించి అన్ని కష్టాలు తొలగిపోతాయని భక్తులు ఈ మాసంలో విశేషమైన పూజలు, ముడుపులు చెల్లించుకుని శివుడిని పూజిస్తారు. అటువంటి శ్రావణ మాసంలో మన ఇంట్లో తప్పనిసరిగా కొన్ని వస్తువులను తెచ్చి పెట్టుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

 

వీటిలో శివుడి పటం , విగ్రహం మరియు శివలింగం ముఖ్యంగా ఇంట్లోకి తెచ్చుకోవలసిన వస్తువులు. వాస్తు శాస్త్ర ప్రకారం కూడా ఇంట్లో శివుడి బొమ్మ కానీ విగ్రహం కానీ ఉండడం శుభప్రదం. అయితే ఇంట్లో శివుడి విగ్రహం లేదా ఫోటోను ఎక్కడ ఉంచాలి? ఎలా ఉంచాలి అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.

 

మన పురాణాల ప్రకారం కైలాస పర్వతానికి ఈశాన్య దిశలో శివుని నివాసం ఉంటుంది. కాబట్టి ఇంట్లో శివుడి బొమ్మ కానీ విగ్రహం కానీ ఉత్తర దిశలో ప్రతిష్టించడం శ్రేయస్కరం. కానీ మన వాస్తు శాస్త్రం ప్రకారం రౌద్రంగా ఉన్న శివుని బొమ్మ కానీ పటం కానీ ఇంట్లో ఉండడం మంచిది కాదు. ఉగ్ర భంగిమ వినాశనానికి సూచన కాబట్టి అది ఇంట్లో అశాంతిని కలిగిస్తుంది. అందుకే ప్రసన్నంగా కుటుంబ సమేతంగా ఉన్న శివుడి పటాన్ని ,కానీ ధ్యానంలో ఉన్న శివ విగ్రహాన్ని కానీ పెట్టుకోవడం మంచిది. కుటుంబ సమేతంగా ఉన్న శివుడి పటాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంటి గొడవలు సమసి పోతాయి.

 

శివుని బొమ్మ ఇంటి సభ్యులందరికీ కనిపించే విధంగా ఉండే ప్రదేశంలో పెట్టాలి. రోజు అందరూ ఆ బొమ్మను దర్శించుకోవడం ఎంతో మంచిది. మనం శివుని చిత్రపటం ఇంటికి తెచ్చుకునేటప్పుడు ముఖ్యంగా గమనించాల్సింది అతని ముఖంలో ఉన్న ప్రసన్నత మరియు నవ్వు. అలా ఉన్నప్పుడే ఆ ఫోటో చూసి మన మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది. అలాగే మన కుటుంబంలో సుఖసంతోషాలు సమృద్ధిగా ఉంటాయి.

 

మనం ఏ ప్రదేశంలో అయితే శివుడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తాము అక్కడ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. నిత్యం విగ్రహం ఉన్న ప్రదేశాన్ని శుభ్రపరచాలి. ఫోటో లేదా విగ్రహం చుట్టూ దుమ్ము ధూళి లేకుండా జాగ్రత్తలు వహించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం మురికి ప్రదేశంలో దేవుడి ఫోటో పెట్టడం వల్ల దోషం ఉంటుంది, డబ్బు కొరత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి శివుడి బొమ్మ లేదా విగ్రహం స్థాపించిన ప్రదేశం ఎప్పుడు సుచిగా ,శుభ్రంగా ఉండేలా చూసుకోవడం ఎంతో అవసరం.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -