Vastu Tips: వాస్తును కలబంద మొక్కతో ఎలా సెట్ చేసుకోవచ్చో తెలుసా?

Vastu Tips: కలబంద మనకు లభించే వాటిలో దివ్యౌషధమైన మొక్క. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. చర్మ సంరక్షణ కోసం అల్లోవెరాను విరివిగా వినియోగిస్తుంటారు. దాంతోపాటు ఇతర ఉత్పత్తుల తయారీలోనూ కలబందను వినియోగిస్తుంటారు. వాస్తు శాస్త్రంలో కూడా కలబందకు విశేష ప్రాధాన్యం ఇచ్చారు పండితులు. కలబంద మొక్కను ఇంట్లో ఉంచుకోవడం, పెంచుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరతాయని చెబుతున్నారు.

కలబందను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ వైదొలగిపోతాయి. పాజిటివ్‌ ఎనర్జీ ప్రవేశిస్తుందని వాస్తు పండితులు స్పష్టం చేస్తున్నారు. దాంతోపాటు వ్యక్తిగత జీవితంలో కూడా అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని చెబుతున్నారు. ఇక ఇంట్లో కలబందను ఏ ప్రాంతంలో, ఏ దిక్కులు ఉంచుకోవాలో కూడా వాస్తు శాస్త్రంలో వివరించారు.

కలబందను ఇంట్లో సూర్యరశ్మి ప్రవేశించే ప్రాంతాల్లో ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అంటే కిటికీలు, లేదా సెల్ప్‌లు వంటి వాటి వద్ద కలబందను పెంచుకోవాలి. ఇలా అల్లోవెరా మొక్కపై సూర్యుని కిరణాలు పడటం, తర్వాత ఆ కాంతి ఇంట్లోకి చేరడం వల్ల పాజిటివ్‌ ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఇంట్లో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయని చెబుతున్నారు. ఆర్థికపరంగానూ అనేక ప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు.

ఈ దిక్కులో ఉంచితే శుభఫలితాలు..
అల్లెవెరా మొక్క ఆకు పచ్చని రంగులో ఉంటే ఇక ఆ ఇంట్లో అదృష్టం వరించినట్లేనని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి కూడా కలబంద ఉపయోగపడుతుంది. చాలా ఈ మొక్కను పెరట్లో నాటుతుంటారని, అలా కాకుండా ఇంటి లోపల పెంచుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. కలబంద మొక్కను తూర్పు లేదా ఉత్తర దిశలో నాటడం వల్ల ఉత్తమ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Janasena Complaint on YS Jagan: ఏపీ ఎన్నికల సంఘం దృష్టికి పవన్ పెళ్లిళ్ల గోల.. జగన్ కు భారీ షాక్ తప్పదా?

Janasena Complaint on YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్లిన ఏ సభకు వెళ్లిన అక్కడ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావనకు తీసుకువస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్...
- Advertisement -
- Advertisement -