Vastu Tips: ఇంట్లో ఆ దిశలో అవి పెట్టుకుంటే ఎంతో మంచి జరుగుతుందట

Vastu Tips: టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కి మానవుల జీవితాల్లో ఎన్ని మార్పులు వచ్చినా.. పాత పద్దతులను చాలామంది వదులుకోరు. పాత సంప్రదాయాలను పాటిస్తూనే ఉంటారు. పూర్వీకులు పాటించిన సంప్రదాయాలను కొనసాగిస్తూ ఉంటారు. అయితే సాంకేతిక కాలంలో కూడా వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇంటి నిర్మాణం సమయంలో లేదా ఇంట్లోని వస్తువులు ఎక్కడెక్కడ పెట్టుకోవాలనే దానిపై అనేకమంది వాస్తు పండితులను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇంటితో పాటు ఆఫీసులలో కూడా వాస్తు ప్రకారం వస్తువులు పెడుతూ ఉంటారు.

 

ఏయే వస్తువులు ఏేయే ప్రదేశంలో ఉండాలి. ఇంటి నిర్మాణం సమయంలో ఏ స్థానంలో ఏవి ఉండాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుంటే.. ఉత్తరం దిశలో బెడ్ రూమ్, స్విమ్మింగ్ పూల్, ప్రవేశద్వారం, బాల్కానీ ఉంటే మంచిదని చెబుతున్నారు. ఇక దక్షిణ దిశలో మాస్టర్ బెడ్ రూమ్ ఉంటే మంచిదని చెబుతున్నారు. ఇక ఆఫీసులలో అయితే సీఈఓ రూమ్ ఉంటే మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు.

ఇక పశ్చిమ దిశలో బెడ్ రూమ్ తో పాటు కిచెన్ పెట్టుకోవచ్చని చెబుతున్నారు. ఇక ఆఫీసుల విషయానికొస్తే.. సీనియర్, మధ్యస్థాయి ఉద్యోగుల క్యాబిన్లకు అనువైన ప్రదేశం అని చెబుతున్నారు. ఇక ఇంట్లో అయితే క్రీడా పరికరాల నిల్వ లేదా ఓవర్ హోడ్ వాటర్ ట్యాంకులను కూడా ఈ దిశలో ఏర్పాటు చేసుకోవచ్చని చెబుతున్నారు.

తూర్పు దిశ విషయానికొస్తే.. సూర్యుడు కాంతి వచ్చే ఈ దిశలో బాల్కానీ, కిటికీలు, తలుపులు పెట్టుకోవడం మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాగే లివింగ్,డ్రాయింగ్ రూమ్ లు లేదా ఫ్యామిలీ లాంజ్ ఏర్పాటు చేసుకుంటే మంచిదని చెబుతున్నారు. ఇక ఈశాన్యం దిశలో పూజ లేదా ధ్యాన గదిని ఏర్పాటు చేసుకుంటే మంచిదని చెబుతున్నారు. యోగా రూమ్ ఈ దిశలో ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెబుతున్నారు. ఇక వాయవ్యం దిశలో రిఫ్రిజిరేటర్లు, ఎలివేటర్లు లాంటివి ఉంచుకుంటే మంచివని చెబుతున్నారు.ఇక అతిథి గది ఏర్పాటు చేసుకున్నా మంచిదని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnam Raju: రఘురామ కృష్ణంరాజు కల నెరవేరిందిగా.. ఉండి ఎమ్మెల్యేగా ఆయన విజయం పక్కా!

Raghurama Krishnam Raju: ప్రస్తుత నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలుపొందారు. ఇలా గెలిచిన కొద్ది రోజులకే పార్టీ పిఠాయించి తెలుగుదేశం చెంతకు చేరారు....
- Advertisement -
- Advertisement -