Vasundhara: నందమూరి వసుంధర గురించి ఈ విషయాలు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!

Vasundhara: నందమూరి బాలకృష్ణ.. తెలుగు జనాలు ఎక్కడున్నా కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా గుర్తింపు తెచ్చుకుని, తెలుగుదేశం పార్టీని స్థాపించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చేసిన నందమూరి రామారావు వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలయ్య అందరి హృదయాల్లో తనదైన ముద్రను వేసుకున్నాడు.

 

కేవలం సినిమాలే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించే బాలయ్య.. అప్పుడప్పుడు కాంట్రవర్సీలతో వార్తల్లో కూడా నిలుస్తుంటాడు. తెలుగులో అత్యధిక రిజిస్టర్డ్ ఫ్యాన్స్ కలిగిన హీరోగా నందమూరి బాలయ్య ఉండగా.. ప్రస్తుతం సినిమాలతో పాటు ఆహాలో ‘అన్ స్టాపబుల్2’ టాక్ షో చేస్తున్నాడు.

 

ఇక నందమూరి బాలయ్య 1982లో వసుంధరను పెళ్లి చేసుకోగా.. ఆమె గురించి కొన్ని వార్తలు ఈ మధ్యన వైరల్ అవుతున్నాయి. వసుంధర బ్యాగ్రౌండ్ గురించి తెలిసిన వాళ్లంతా.. వామ్మో వసుంధరకు అంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. వసుంధర శ్రీరామ దాసు మోటార్ ట్రాన్ పోర్ట్ అధినేత దేవరపల్లి సూర్యారావు కూతురు. వేల కోట్ల రూపాయల ఆస్తికి ఆమె అధిపతి.

 

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నా వసుంధర నందమూరి బాలయ్యను పెళ్లి చేసుకున్నారు. కాకినాడలో ‘రామ్ రహీం’ సినిమా షూటింగ్ లో బాలయ్య రిక్షా తొక్కడం చూసిన వసుంధర తల్లి.. ఎన్టీఆర్ కొడుకు రిక్షా తొక్కడం ఏంటని షాక్ అయ్యారట. ఆ తర్వాత అది షూటింగ్ కోసం అని తెలుసుకున్నారట. ఈ విషయాన్ని బాలయ్య పెళ్లి తర్వాత ఆమే స్వయంగా చెప్పారట. వసుంధర పేరు మీద కోట్ల రూపాయలతో పాటు విలువైన బంగారం,వెండి, వజ్రాలు, బంగళాలు, కార్లు, చాలా కంపెనీల్లో షేర్లు ఉన్నాయట.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -