Veera Simha Reddy: ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీరసింహారెడ్డి.. ఏమైందంటే?

Veera Simha Reddy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ ను వీరలెవల్ లో చూపించగల సత్తా ఉన్న హీరో నందమూరి బాలయ్య. ఆయన డైలాగులు చెబుతుంటూ థియేటర్లో పూనకాలు రావాల్సిందే. మాస్ జనాల్లో విపరీతమైన క్రేజ్ కలిగిన నందమూరి బాలయ్య ఈ సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’గా రాబోతున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ బయటకు లీక్ అయింది. నెట్టింట వైరల్ అవుతున్న ఫస్ట్ రివ్యూ ప్రకారం సినిమా హిట్ అని తెలుస్తుండగా.. ఆ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం.

 

తెలుగుతో పాటు పలు భాషల సినిమాలకు సంబంధించిన రివ్యూలను అందరి కంటే ముందే వెల్లడించే ఉమైర్ సంధు.. తాజాగా నందమూరి బాలయ్య హీరోగా చేసిన ‘వీరసింహారెడ్డి’ సినిమా రివ్యూను నెట్టింట పోస్ట్ చేశాడు. అతడు పోస్ట్ చేసిన దాని ప్రకారం సినిమా అద్భుతంగా ఉందని, ఫ్యాన్స్ కు పూనకాలు తప్పకుండా వస్తాయని వెల్లడించాడు. ఈ సినిమాకు అతడు ఇచ్చిన రేటింగ్ కూడా హిట్ రేటింగ్ అయిన 3.5/5.

 

ఉమైర్ సంధు ‘వీరసింహారెడ్డి’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూను పోస్ట్ చేస్తూ ఇలా రాశాడు.. ‘సినిమాకు ఎ టు జెడ్ బాలయ్య నిలిచాడు. రెండు పాత్రల్లో ఆయన చూపించిన వేరియేషన్స్ అద్బుతం. మాస్ ఆడియన్స్‌ కు అలాగే బాలయ్య అభిమానులకు స్క్రీన్ పై ఆయన కనబడగానే పూనకాలు రావడం గ్యారెంటీ. బుర్రా సాయి మాధవ్ రాసిన డైలాగ్స్ బాలయ్య చెప్పడం, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూజ్ బంప్స్ తెప్పిస్తాయి’ అని వివరించాడు.

 

‘వీరసింహారెడ్డి’ సినిమాలోని ఎమోషనల్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టిపడేస్తాయని ఉమైర్ సంధు వివరించాడు. సినిమాలోని ఇంటర్వెల్ సీన్ అదిరిందని, ఫైట్స్ కూడా బాగున్నాయని, క్లైమాక్స్ 15 నిమిషాలు సినిమా చూస్తున్న ప్రేక్షకులను కట్టిపడేస్తాయని అతడు తెలిపాడు. ఓవరాల్ గా ఈ సినిమా సంక్రాంతికి ఫ్యాన్స్ కు ఇచ్చే ఫీస్ట్ అని తెలిపాడు. అయితే చాలా సందర్భాల్లో ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూలు తప్పుగా కూడా తేలడం విశేషం.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత ఇలాకాలోనే జగన్ కు మైండ్ బ్లాంక్ అయ్యే షాక్.. వందల బస్సులు పెట్టి తరలించినా జనం లేరుగా!

YS Jagan: మనుషులు లేకపోయినా అభివాదం చేయడం.. కష్టంలో ఉన్నవారి దగ్గరకు వెళ్లి అక్కడ కూడా మనస్పూర్తిగా నవ్వడం ఏపీ సీఎం జగన్‌లోనే చూడొచ్చు. ఈ మధ్య ఓ రీల్ బాగా గ్రెండ్...
- Advertisement -
- Advertisement -